న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి విశ్రాంతి కావాలని అడిగితే దాన్ని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) తిరస్కరించిందంటూ వచ్చిన వార్తలను మాజీ కెప్టెన్, భారత జూనియర్, 'ఎ' జట్ల కోచ్ రాహుల్ ద్రవిడ్ ఖండించాడు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదనా స్సష్టం చేశాడు. అవి కేవలం రూమర్లే కాకుండా, అనవసరపు వివాదం కూడా అని ద్రవిడ్ తేల్చిపారేశాడు.
'శ్రీలంకతో సిరీస్ కు విరాట్ విశ్రాంతి కొరిన విషయం వాస్తవం కాదు. విరాట్ విశ్రాంతి అడగడం, దాన్ని తిరస్కరించడం జరగలేదు. ప్రతీ ఒక్కరికీ విశ్రాంతి అనేది అవసరం. ఆ క్రమంలోనే విరాట్ కోహ్లి కావాలంటే విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. అంతేకానీ విరాట్ కోహ్లి విశ్రాంతి అడిగితే బీసీసీఐ కాదనే వార్తలు చక్కర్లు కొట్టడం నిజంగా బాధాకరం. ఇది అవసరంలేని కాంట్రవర్సీ'అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం తన కోచింగ్ జాబ్ ను ఎంతగానో ఆస్వాదిస్తున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ దిగ్గజ క్రికెటర్ చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment