హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యధిక పరుగులు నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా మరొకసారి టాప్‌కు చేరాడు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రైనా 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయంగా 54 పరుగులు చేశాడు. ఇది రైనాకు 32వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ కాగా, మొత్తం 4,658 పరుగులు సాధించాడు. దాంతో అత్యధిక ఐపీఎల్ పరుగులు చేసిన క్రికెటర్లలో విరాట్ కోహ్లిని అధిగమించిన రైనా టాప్ ప్లేస్‌కు చేరాడు.
ప్రస్తుతం విరాట్ కోహ్లి(4,649) రెండో స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ(4,345) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆపై గౌతం గంభీర్(4,213) నాల్గో స్థాంనలో ఉన్నాడు. ప్రధానంగా టాప్ ప్లేస్ కోసం కోహ్లి-రైనాల మధ్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌లో రైనాకు జతగా అంబటి రాయుడు(79;37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా బ్యాటింగ్ చేయడంతో పాటు ఎంఎస్ ధోని(25 నాటౌట్;12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) సమయోచితంగా ఆడాడు. దాంతో చెన్నై నిర్ణీత ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 182 పరుగులు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment