కీలక మ్యాచ్లో రాజస్థానే గెలిచింది | rajasthan won by 9 runs | Sakshi
Sakshi News home page

కీలక మ్యాచ్లో రాజస్థానే గెలిచింది

Published Sun, May 17 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

కీలక మ్యాచ్లో రాజస్థానే గెలిచింది

కీలక మ్యాచ్లో రాజస్థానే గెలిచింది

ముంబై: ఐపీఎల్-8లో జరిగిన కీలక మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ విజయం సాధించి ఫ్లేఆఫ్ పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. 9 పరుగుల తేడాతో కోల్కతా పై రాజస్థాన్ రాయల్స్ గెలుపొందింది. తొలుత టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. వాట్సన్(104) మెరుపు ఇన్నింగ్స్తో భారీ స్కోరు చేసింది. ఓపెనర్లుగా వచ్చిన రహానే(37), వాట్సన్(104)లు తొలి నుంచి ధాటిగా ఆడి రాజస్థాన్కి మంచి శుభారంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్కి 80 పరుగుల భాగస్వామ్యన్ని జోటించారు. వేగంగా పరుగులు రాబడుతున్న సమయంలోనే రహానే(37) రనౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన స్మిత్(14) పరుగుల వద్ద రస్సెల్ బౌలింగ్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సామ్సన్(8) , ఫాల్క్నర్(6), కరుణ్(16) మోరీస్(4) పరుగులు చేసి ఔటయ్యారు. వాట్సన్(104) పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.


కోల్ కతా బౌలింగ్లో రస్సెల్ రాణించి మూడు వికెట్లు తీయగా, ఉమేష్ యాదవ్కు ఒక వికెట్ లభించింది.
భారీ లక్ష్యంతో బరిలో దిగిన కోల్కతాకి ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. 8 పరుగుల వద్ద మోరీస్ వేసిన మొదటి ఓవర్లోనే గౌతం గంభీర్(1) క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. 21 పరుగుల వద్ద ఉతప్ప(14) క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.77 పరుగుల వద్ద మనీష్ పాండే(14) భారీ షాట్ కి యత్నించి అవుటయ్యాడు. ఆ తర్వాత వచ్చిన యూసుఫ్ పటాన్(44)రస్సెల్(37)లు ధాటిగా ఆడి వేగంగా పరుగులు రాబట్టారు.132 పరుగుల వద్ద రస్సెల్ సిక్సర్ కి యత్నించి ఔటయ్యాడు. సూర్యకుమార్ యాదవ్(0), యుసుఫ్ పటాన్(44), అజార్ మహమూద్(6), పియూష్ చావ్లా(0) లు త్వరత్వరగా ఔటయ్యారు. చివర్లో 6 బంతుల్లో 16 పరుగులు అవసరమున్న కీలక సమయంలో షకీబ్(13) ఔటయ్యాడు...చివర్లో ఉమెష్ యాదవ్(24) వెగంగా ఆడినా లాభం లేకుండా పోయింది.  మోర్కెల్(4),ఉమెష్ యాదవ్(24)లు నాటౌట్ గా నిలిచారు.


రాజస్థాన్ బౌలింగ్ లో మోరీస్ 4 వికెట్లు తీసి మెరిపించాగా, కులకర్ణి, షేన్ వాట్సన్లు చేరో 2 వికెట్లు తీశారు. ఫాల్క్నర్ కి ఒక వికెట్ దక్కింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement