సెమీస్‌లో రమ్య, ఆయుషి | Ramaya,Ayusha reached in semi finals | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో రమ్య, ఆయుషి

Published Fri, Oct 18 2013 11:57 PM | Last Updated on Fri, Sep 1 2017 11:45 PM

Ramaya,Ayusha reached in semi finals

 జింఖానా, న్యూస్‌లైన్: అనంత నారాయణ రె డ్డి, రామేశ్వరమ్మ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీ క్యాడెట్ బాలికల విభాగంలో రమ్య, ఆయుషి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం ఈ టోర్నీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సి.వి శేష సాయి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఆనంద్ నగర్ వె ల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో రమ్య (ఎస్‌పీఎస్‌టీటీఏ) 11-9, 11-8, 11-6తో మహితా చౌదరి (వీజేఏ)పై, ఆయుషి (జీఎస్‌ఎం) 11-4, 11-6, 11-4తో భవిత (జీఎస్‌ఎం)పై విజయం సాధించారు. వీరితో పాటు కాజోల్ (వీజేఏ) 11-9, 11-8, 11-3తో కీర్తన (వైఎంసీఏ)పై, నజ్రీబి (వీజేఏ) 11-3, 11-4, 11-1తో రుచిర (ఎస్‌పీఎస్‌టీటీఏ) పై గెలుపొందారు.
 
 ఇతర ఫలితాలు
 సబ్ జూనియర్ బాలికల రెండో రౌండ్: వైశాలి (ఏటీపీ) 11-1, 11-2, 11-2 స్కోరుతో కీర్తన
 (వైఎంసీఏ)పై, రచన (జీఎస్‌ఎం) 11-4, 11-6, 11-5తో ప్రాచి గోలస్ (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, అనూష రెడ్డి (వీజేఏ) 11-4, 11-2, 11-5తో రుచిత (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై,  కాలామృత (వీజేఏ)పై వాకోవర్‌తో రాగ నివేదిత (జీటీటీఏ), నజ్రీబి (వీజేఏ) 11-8, 7-11, 11-9, 11-3తో పాలక్ షా (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, ఆయుషి (జీఎస్‌ఎం) 11-5, 11-7, 11-6తో భార్గవి (ఏడబ్ల్యూఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్‌ఎం) 11-3, 11-3, 11-3తో స్నేహిత (మెరిడియన్)పై, నూర్ బాషా (వీజేఏ) 11-2, 11-2, 11-5తో సమీరన్ సుల్తాన (వీజేఏ)పై, ప్రణీత (జీఎస్‌ఎం) 11-0, 11-6, 11-4తో సాయి శ్రీత (వీజేఏ)పై, లాస్య (ఏడబ్ల్యూఏ) 11-6, 11-2, 11-6తో రుచిర (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, మహిత (వీజేఏ) 11-5, 11-6, 11-5తో హేమ ప్రియ (ఏస్ అకాడమీ)పై, సాయి భవాని (ఎన్‌ఎల్‌జీ) 11-2, 11-5, 11-9తో రమ్య (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై నెగ్గారు.
 
 జూనియర్ బాలికల రెండో రౌండ్: వైశాలి (ఏటీపీ) 11-3, 11-4, 11-6తో గ్రితికా అస్రాని (వీజేఏ)పై, పాలక్ షా (ఎస్‌పీఎస్‌టీటీఏ) 11-5, 11-4, 10-12, 12-10తో అఫ్సా (మెరిడియన్)పై, సైరా బాను (వీజేఏ) 9-11, 11-4, 11-8, 11-6తో స్నేహిత (మెరిడియన్)పై, అనూషా రెడ్డి (వీజేఏ) 11-8, 13-11, 11-3తో దిశ (ఎన్‌ఎల్‌జీ)పై, మిహిక (ఏడబ్ల్యూఏ) వాకోవర్‌తో మహితా చౌదరి (వీజేఏ)పై, ఆయుషి (జీఎస్‌ఎం) 11-2, 11-5, 11-6తో సాయి శ్రీత (వీజేఏ)పై, నూర్ బాషా (వీజేఏ) 11-3, 11-5, 11-5తో సంవేద (డాన్ బాస్కొ)పై, నాగ శ్రావణి (ఏస్ అకాడమీ) 11-5, 11-3, 11-8తో రచన (జీఎస్‌ఎం)పై, సాయి భవాని (ఎన్‌ఎల్‌జీ) 11-3, 11-7, 11-4తో రాగ నివేదిత (జీటీటీఏ)పై, మౌనిక (జీఎస్‌ఎం) 11-2, 11-5, 11-2తో భార్గవి (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement