నిఖత్, వైశాలి ‘డబుల్’ | Nikitha,vaishali double | Sakshi
Sakshi News home page

నిఖత్, వైశాలి ‘డబుల్’

Published Mon, Oct 21 2013 12:00 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

Nikitha,vaishali double

జింఖానా, న్యూస్‌లైన్: అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్‌లో నిఖత్ బాను, వైశాలి ‘డబుల్’ సాధించారు. యూత్, మహిళల సింగిల్స్ విభాగాల్లో నిఖత్ బాను... జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో వైశాలి విజేతగా నిలిచారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో వైశాలి (అనంతపురం) 11-7, 7-11, 3-11, 11-9, 11-7, 10-12, 11-9తో నూర్ బాషా (జీఎస్‌ఎం)పై నెగ్గింది. జూనియర్ బాలికల విభాగంలో వైశాలికి ఫైనల్ ప్రత్యర్థి మౌనిక (జీఎస్‌ఎం) నుంచి ‘వాకోవర్’ లభించింది.
 
 యూత్, మిహ ళా విభాగాల ఫైనల్స్‌లో నిఖత్  బానుకు ప్రత్యర్థి మౌనిక నుంచి వాకోవర్ లభించడంతో ఆమె బరిలోకి దిగకుండానే టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. యూత్ బాలికల సెమీఫైనల్స్‌లో నిఖత్ 11-7, 11-7, 12-10, 11-8తో నూర్ బాషా (విజ యవాడ)పై, మౌనిక 11-4, 11-4, 8-11, 14-12, 11-3తో కాజోల్ (విజయవాడ)పై గెలిచారు. మహిళల విభాగంలో నిఖత్ 11-8, 11-3, 11-7, 8-11, 7-11, 11-5తో వైశాలి (అనంతపురం)పై, మౌనిక 7-11, 11-5, 10-12, 12-10, 11-9, 6-11, 11-8తో నాగ శ్రావణి (ఏస్ అకాడమీ)పై గెలుపొందారు.
 
 ఇతర ఫలితాలు
 మినీ క్యాడెట్ బాలుర ఫైనల్: కార్తీక్ 11-3, 11-2, 13-11తో అక్షత్‌పై గెలిచాడు. సెమీఫైనల్స్: కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 8-11, 12-10, 11-6, 11-6తో సూర్యతేజ (కాకినాడ)పై, అక్షత్ (విజయవాడ) 11-5, 14-12, 14-12తో కేశవన్ (జీటీటీఏ)పై నెగ్గారు.
 
 మినీ క్యాడెట్ బాలికల ఫైనల్: భవిత 11-7, 10-12, 11-7, 11-8తో రుచిరపై విజయం సాధించింది. సెమీఫైనల్స్: భవిత (జీఎస్‌ఎం) 11-4, 11-4, 11-7తో ఇక్షత (ఏడబ్ల్యూఏ)పై, రుచిర (ఎస్‌పీఎస్‌టీటీఏ) 11-4, 11-9, 11-4తో మధుర (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు.
 సబ్ జూనియర్ బాలుర ఫైనల్: స్నేహిత్  11-8, 11-6, 13-11, 11-8తో సరోజ్ సిరిల్‌పై గెలిచాడు. సెమీఫైనల్స్: స్నేహిత్ (జీటీటీఏ) 14-12, 11-7, 11-4, 9-11, 12-10తో అలీ మహ్మద్ (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, సరోజ్ సిరిల్ (ఎస్‌పీఎస్‌టీటీఏ) 11-5, 7-11, 11-7, 3-11, 11-5, 11-9తో పీయూష్ అగర్వాల్ (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై నెగ్గారు.
 జూనియర్ బాలుర ఫైనల్: హరికృష్ణ 15-13, 11-9, 11-8తో జగదీశ్ కృష్ణపై విజయం సాధించాడు. సెమీఫైనల్స్: జగదీశ్ కృష్ణ (ఏడబ్ల్యూఏ) 11-7, 7-11, 10-12, 9-11, 11-4, 11-5, 11-8తో సరోజ్ సిరిల్ (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, హరికృష్ణ (ఎస్‌పీఎస్‌టీటీఏ) 18-16, 12-10, 11-8, 6-11, 11-2తో స్నేహిత్ (జీటీటీఏ)పై గెలుపొందారు.
 
 యూత్ బాలుర ఫైనల్: హరికృష్ణ (ఎస్‌పీఎస్‌టీటీఏ) 13-11, 11-3, 8-11, 13-11, 11-9తో సాయి ప్రణీత్ (వీజేఏ)పై గెలిచాడు. సెమీఫైనల్స్: హరికృష్ణ (ఎస్‌పీఎస్‌టీటీఏ) 11-4, 11-9, 11-7, 8-11, 11-8తో సరోజ్ సిరిల్ (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, సాయి ప్రణీత్ (వీజేఏ) 12-10, 8-11, 8-11, 2-11, 11-9, 13-11, 13-11తో గౌతమ్ కృష్ణ (ఏడ బ్ల్యూఏ)పై గెలుపొందారు.
 పురుషుల విభాగం ఫైనల్: సోమనాథ్ ఘోష్ 11-7, 11-6, 11-8, 11-8తో విశాల్‌పై విజయం సాధించాడు. సెమీఫైనల్స్: మనోహర్ నుంచి (ఓఐసీ) విశాల్ (ఏజీఎస్) వాకోవర్ లభించగా... సోమనాథ్ ఘోష్ (ఎస్‌సీఆర్) 11-7, 8-11, 6-11, 11-7, 11-2, 14-12తో  కృష్ణ కిరీటీపై నెగ్గాడు.
 
 వెటరన్ సింగిల్స్ 40-50: హేమంత్ కుమార్ (సెంట్రల్ ఎక్సైజ్) 11-7, 11-8, 11-9తో నటరాజ్ శర్మ (బీహెచ్‌ఈఎల్)పై నెగ్గారు.
 60-70 విభాగం: శ్రీనివాస్ (ఏపీజీ) 11-9, 12-10, 12-10తో నాగరాజ్ (జీఎస్‌ఐ)పై గెలిచారు.
 
 ఇంటర్ ఇన్‌స్టిట్యూషనల్
 టీమ్ చాంపియన్‌షిప్
 ఫైనల్స్: ఏజీ ఆఫీస్ హైదరాబాద్ 3-1తో ఎస్‌బీఐపై విజయం సాధించింది. కిషోర్ (ఏజీఎస్) 11-6, 14-12, 11-5తో నాగేందర్ రెడ్డి (ఎస్‌బీఐ)పై, అజయ్ కుమార్ (ఎస్‌బీఐ) 11-7, 11-9, 11-5తో విశాల్ (ఏజీఎస్)పై, కృష్ణ కిరీటి-విశాల్  (ఏజీఎస్) జట్టు 11-9, 11-3, 13-11తో నాగేందర్ రెడ్డి-ఇబ్రహీమ్ ఖాన్ (ఎస్‌బీఐ) జోడీపై, విశాల్ (ఏజీఎస్) 8-11, 11-8, 11-3, 11-4తో నాగేందర్ రెడ్డి (ఎస్‌బీఐ)పై నెగ్గారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement