కరీంనగర్ : పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి జట్లు సత్తా చాటాయి. కరీంనగర్‌లోని కొత్తపల్లి ఆల్ఫోర్స్ పాఠశాలలో జరిగిన ఈ టోర్నీలో బాలబాలికల విభాగాల్లో రంగారెడ్డి జట్లు విజేతలుగా నిలిచి టైటిళ్లను కైవసం చేసుకున్నాయి. అండర్–17 స్థాయిలో ఫాయిల్, ఇపీ, సాబెర్ విభాగాల్లో నిర్వహించిన ఈ టోర్నీలో రాష్ట్రంలోని 8 జిల్లాలకు చెందిన ఆటగాళ్లు పాల్గొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జాతీయ ఫెన్సింగ్ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్లకు ఎంపికయ్యారు. బహుమతి ప్రదాన కార్యక్రమంలో ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత వి. నరేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు.
జట్ల వివరాలు
ఫాయిల్ బాలుర జట్టు: జి. మణికంఠ, రోహిత్, తప్‌జ్యోత్‌సింగ్, సాయినివాస్; బాలికలు: కె. గౌరి, జి. శిరీష, హరిణి, జి. సుజాత. ఇపీ బాలుర జట్టు: రవితేజ, ఆకాశ్‌రెడ్డి, సుమిత్, పవన్‌కళ్యాణ్; బాలికలు: వై. ఉమామహేశ్వరి, ఎల్. నమ్రత జాదవ్, వి. భార్గవి, వర్షిత. సాబెర్ బాలుర జట్టు: ఎస్‌కే ఇమ్రాన్, శ్రావణ్, తప్‌జ్యోత్‌సింగ్, సాయిరాం; బాలికలు: బేబి రెడ్డి, ఎ. శిరీష, కె. ప్రజ్ఞ, వి. సరయు.
Comments
Please login to add a commentAdd a comment