కబడ్డీ క్రీడాకారిణిపై అత్యాచారయత్నం! | Rape attempt on Kabaddi player | Sakshi
Sakshi News home page

కబడ్డీ క్రీడాకారిణిపై అత్యాచారయత్నం!

Published Thu, Jun 25 2015 2:14 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

కబడ్డీ క్రీడాకారిణిపై అత్యాచారయత్నం! - Sakshi

కబడ్డీ క్రీడాకారిణిపై అత్యాచారయత్నం!

కాన్పూర్ : జాతీయ స్థాయికబడ్డీ క్రీడాకారిణి స్నేహా సింగ్ (డాలీ)పై ఈనెల 15న తన ఇంటి సమీపంలో ఉండే ఉజాలా ఠాకూర్, గాంధీలు అత్యాచారయత్నం చేసేందుకు ప్రయత్నించారు. ఈ సంఘటనలో స్నేహ తీవ్రంగా ప్రతిఘటించడంతో అప్పటికి వదిలేసి వెళ్లిన ఆ ఇద్దరు తర్వాతి రోజు ఆమెపై దాడికి తెగబడ్డారు. లాఠీతో కొట్టడంతో క్రీడాకారిణి ముక్కు విరగడంతో పాటు అక్కడక్కడ దెబ్బలు తగిలాయి. ఈ దాడిని అడ్డుకునేందుకు వెళ్లిన స్నేహ బంధువులకు కూడా గాయాలయ్యాయి. అయితే జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేసేందుకు బారా పోలీస్ స్టేషన్‌కు వెళ్లితే పోలీసులు తేలికగా తీసుకున్నారని ఆమె ఆరోపించింది.

ఏవో చిన్న సెక్షన్లతో కేసు నమోదు చేసినా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నించలేదని చెప్పింది. జరిగిన ఉదంతంపై మంగళవారం కాన్పూర్ ఎస్‌ఎస్‌పీ శలబ్ మాథూర్‌ని కలిసి ఆమె మరోసారి ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన మాథూర్... స్నేహను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. క్రీడాకారిణి స్వల్ప గాయాలతో బాధపడుతుందని నివేదిక రావడంతో.... వాటి ఆధారంగా ఐపీసీ సెక్షన్ 323, 504, 506, 325ల కింద కేసును నమోదు చేశారు. రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement