కోల్‌కతా: వచ్చే వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఆడటంపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అనుమానం వ్యక్తం చేశాడు. వరల్డ్‌కప్‌కు భారత జట్టును ఎంపిక చేసే అప్పటి పరిస్థితుల్ని బట్టి మాత్రమే అతనికి చోటుపై ఒక స్పష్టత ఉంటుందన్నాడు. ప్రస్తుతానికైతే రిషభ్‌కు కచ్చితంగా వరల్డ్‌కప్‌కు వెళ్లే భారత జట్టులో చోటు ఉంటుందా అనేది చెప్పలేమన్నాడు. రిషభ్ పంత్ నిస్సందేహంగా భావి భారత క్రికెటర్ అని కొనియాడుతూనే, అతను వరల్డ్‌కప్ నాటికి ఫిట్ కావాల్సిన అవసరం ఉందన్నాడు.
ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ కు దినేష్ కార్తీక్ బదులు సెలెక్టర్లు పంత్‌పై మొగ్గు చూపారు. కానీ కేవలం మూడు వన్డేల అనుభవజ్ఞుడే అయిన పంత్.. వరల్డ్ కప్‌లో ఆడగలడా అనే దానిపై గంగూలీ సందేహం వ్యక్తం చేశాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో రిషభ్ నిరూపించుకుంటూనే వరల్డ్‌కప్ బెర్తుపై ఆశలు పెట్టుకోవచ్చాడు. ‘అతడు ప్రపంచ కప్ జట్టులో ఇమడాలి. ఇప్పటికిప్పుడు అతడికది సాధ్యమా అన్నది అనుమానమే. అప్పటికి రిషభ్ ఫిట్ అవుతాడా..లేదా అనేది కాలమే సమాధానం చెబుతుంది. కానీ అతడు భారత్ భవిష్యత్ ఆశాశాకిరణం’ అని సౌరవ్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment