
టీమిండియా యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్.. సిడ్నీ టెస్టులో సత్తా చాటాడు.
సిడ్నీ: టీమిండియా యువ బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్.. సిడ్నీ టెస్టులో సత్తా చాటాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శతకం బాదాడు. ఫోర్‌తో శతకం పూర్తి చేశాడు. 137 బంతుల్లో 8 ఫోర్లతో సెంచరీ సాధించాడు. టెస్టుల్లో అతడికి రెండో సెంచరీ. పంత్ చేసిన రెండు శతకాలు కూడా ఆయా సిరీస్‌ల్లో చివరి టెస్టులే కావడం విశేషం.
2018, సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో పంత్ తొలి సెంచరీ(114) చేశాడు. కంగారూ గడ్డమీద శతకం బాదిన తొలి భారత వికెట్ కీపర్‌గా పంత్ చరిత్ర సృష్టించాడు. తాజా శతకంతో ఆసియా బయట రెండు సెంచరీలు సాధించిన భారత వికెట్ కీపర్ కూడా అతడు ఖ్యాతి దక్కించుకున్నాడు.