ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గురువారం ఇక్కడ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేష్ స్టేడియంలో గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
రాజ్కోట్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా గురువారం ఇక్కడ సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేష్ స్టేడియంలో గుజరాత్ లయన్స్తో జరుగుతున్న మ్యాచ్లో పుణె సూపర్ జెయింట్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే తమ తమ తొలి మ్యాచ్ల్లో గెలిచి శుభారంభం చేసిన ఇరు జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సన్నద్ధమయ్యాయి.
ఇరు జట్లలో స్టార్ ఆటగాళ్లు ఉండటంతో గెలుపుపై ఎవరికే వారే ధీమాగా ఉన్నారు. పుణె జట్టులో కెవిన్ పీటర్సన్, స్టీవ్ స్మిత్, డు ప్లెసిస్, ధోని, మిచెల్ మార్ష్ వంటి మ్యాచ్ విన్నర్లు ఉండగా, గుజరాత్ లయన్స్ జట్టులో రైనాతో పాటు బ్రెండన్ మెకల్లమ్, ఆరోన్ ఫించ్, దినేష్ కార్తీక్, డ్వేన్ బ్రేవో, రవీంద్ర జడేజా ,ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.