రోహిత్, రహానే హాఫ్ సెంచరీలు, భారత్ మ్యాచ్ డ్రా!
రోహిత్, రహానే హాఫ్ సెంచరీలు, భారత్ మ్యాచ్ డ్రా!
Published Mon, Feb 3 2014 12:03 PM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM
భారత టాప్ ఆర్డర్ విఫలమైనప్పటికి మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, అజింకా రహానే లు అర్ధ శతకాలు నమోదు చేసుకోవడంతో భారత,న్యూజిలాండ్ ఎలెవన్ జట్ల మధ్య జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా గా ముగిసింది. టెస్ట్ సిరీస్ కు ముందు రోహిత్ శర్మ, అజింకా రహానేలు ఫామ్ లోకి రావడం భారత్ కు సానుకూల అంశంగా మారింది.
రెండవ రోజు భారత జట్టు 93 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 313 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. రహానే 60, రోహిత్ శర్మ 59 పరుగులు చేశారు. అంతకుముందు న్యూజిలాండ్ ఎలెవన్ జట్టు 9 వికెట్ల నష్టానికి 262 పరుగులు చేసింది. రెండు టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత, కివీస్ జట్ల మధ్య తొలి టెస్ట్ ఫిబ్రవరి 6న ఆక్లాండ్ లో ప్రారంభంకానుంది.
Advertisement
Advertisement