బర్మింగ్‌హామ్: ప్రస్తుత వన్డే వరల్డ్‌కప్‌లో సెంచరీలతో జోరు మీద ఉన్న టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. వన్డే ఫార్మాట్‌లో ఈ ఏడాది వెయ్యి పరుగుల్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మంగళవారం బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్ ఈ ఫీట్ సాధించాడు. మ్యాచ్‌కు ముందు ఈ ఏడాది వెయ్యి పరుగులు సాధించడానికి నాలుగు పరుగుల దూరంలో ఉన్న రోహిత్.. సిక్స్ కొట్టి దాన్ని పూర్తి చేసుకున్నాడు. బంగ్లా బౌలర్ మొర్తజా వేసిన తొలి ఓవర్ నాల్గో బంతిని సిక్స్‌గా కొట్టి తన పరుగుల ఖాతా తెరిచాడు. కాగా, ఈ ఏడాది వన్డేల్లో వెయ్యి పరుగుల్ని సాధించడానికి కోహ్లి 7 పరుగుల దూరంలో ఉన్నాడు.
బంగ్లాతో మ్యాచ్‌లో టాస్ గెలిచి భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో భారత్ ఇన్నింగ్స్‌ను ఎప్పటిలాగే రోహిత్ శర్మ-కేఎల్ రాహుల్‌లు ఆరంభించారు. తొలి ఓవర్ రెండో బంతికి రాహుల్ పరుగు తీశాడు. ఇక మూడో బంతికి రోహిత్ పరుగులేమీ చేయకపోగా, నాల్గో బంతిని సిక్స్ కొట్టి ఘనంగా ఇన్నింగ్స్ ప్రారంభించాడు. అయితే రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో అర్థ శతకం నమోదు చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment