రియో రెజ్లర్ల బృందంతో సచిన్ | Sachin Tendulkar warms Rio-bound Indian wrestlers after special meet | Sakshi
Sakshi News home page

రియో రెజ్లర్ల బృందంతో సచిన్

Published Tue, May 24 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 12:46 AM

రియో రెజ్లర్ల బృందంతో సచిన్

రియో రెజ్లర్ల బృందంతో సచిన్

న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రియో ఒలింపిక్స్‌కు అర్హత పొందిన రెజ్లర్ల బృందంలో కొత్త ఉత్సాహాన్ని నింపాడు. సోమవారం ఇక్కడి సిటీ హోటల్‌లో రెజ్లర్లతో సమావేశమయ్యాడు. రెండు గంటల పాటు ఆటగాళ్లతో ముచ్చటించి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాడు. ఒత్తిడిని సమర్థంగా ఎలా జయించాలి అనే అంశంపై ఆటగాళ్లకు అవగాహన కల్పించాడు.

సచిన్‌తో జరిగిన భేటీలో యోగేశ్వర్ దత్, సందీప్ తోమర్ మినహా మిగతా రెజ్లర్లు, కోచ్‌లు పాల్గొన్నారు. నర్సింగ్ యాదవ్ (74 కేజీ), వినేశ్ (48 కేజీ), బబితా (53 కేజీ), సాక్షి (58 కేజీ), రవీంద ర్ ఖత్రి (85 కేజీ), హర్‌దీప్ (98 కేజీ)లతో సచిన్ తీసుకున్న ఫోటోలను ట్వీటర్‌లో పోస్ట్ చేశాడు. రియో బృందానికి మాస్టర్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement