పేస్ కు సచిన్ జన్మదిన శుభాకాంక్షలు | Sachin Tendulkar wishes Paes on birthday, also for Rio | Sakshi
Sakshi News home page

పేస్ కు సచిన్ జన్మదిన శుభాకాంక్షలు

Published Fri, Jun 17 2016 4:54 PM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

Sachin Tendulkar wishes Paes on birthday, also for Rio

ముంబై: భారత టెన్నిస్ వెటరన్ ఆటగాడు లియాండర్ పేస్కు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు.  తాజాగా 43వ ఒడిలోకి అడుగుపెట్టిన  పేస్కు సచిన్ తన ట్విటర్ అకౌంట్ ద్వారా శుక్రవారం శుభాకాంక్షలు తెలియజేశాడు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్లో  పేస్ పతకం సాధించాలని సచిన్ ఆకాంక్షించాడు.  ఈ సంవత్సరం పేస్ కు ఒక చిరస్మరణీయమైనదిగా మిగిలిపోవాలని సచిన్ తెలిపాడు.

 

ఆగస్టులో ఆరంభం కానున్న రియో ఒలింపిక్స్ లో భాగంగా పురుషుల డబుల్స్లో రోహన్ బోపన్నతో జోడి కట్టబోతున్న పేస్  తప్పకుండా పతకం సాధిస్తాడని సచిన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇటీవల ఫ్రెంచ్ ఓపెన్లో మిక్స్డ్ డబుల్స్ విభాగంలో పేస్-హింగిస్ల జోడి టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో పేస్  డబుల్స్ , మిక్స్ డ్ డబుల్స్ లో సాధించిన గ్రాండ్ స్లామ్ టైటిల్ సంఖ్య 18కు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement