
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఐటా) మహిళల టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి సాయిదేదీప్య డబుల్స్ విభాగంలో సెమీఫైనల్‌కు చేరుకుంది. మధ్యప్రదేశ్‌కు చెందిన సారా యాదవ్‌తో జతకట్టిన దేదీప్య బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో 4–6, 7–6 (7/5), 10–8తో శ్రావ్య శివాని (తెలంగాణ)–యుబ్రాని బెనర్జీ (పశ్చిమ బెంగాల్) జంటపై గెలుపొందింది. సెమీఫైనల్లో దేదీప్య జోడి సోహా (కర్ణాటక)– సృష్టి (మహారాష్ట్ర) జంటతో తలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment