
'క్వార్టర్' గండం దాటిన సైనా
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పతకం ఖాయం చేసుకుంది.
జకార్తా: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ టోర్నమెంట్ లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ పతకం ఖాయం చేసుకుంది. సైనా నెహ్వాల్ సెమీ ఫైనల్లోకి దూసుకెళ్లింది. తొలిసారిగా క్వార్టర్ ఫైనల్ దాటింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో యియాన్ వాంగ్ పై 21-15, 19-21, 21-19 తేడాతో గెలిచింది.
మొదటి సెట్ గెలిచిన సైనా తర్వాత సెట్ లో తడబడింది. కీలకమైన మూడో సెట్ లో పైచేయి సాధించి విజేతగా నిలిచింది. సైనా నెహ్వాల్ సెమీస్ చేరడంతో కనీసం ఆమెకు కాంస్య పతకం రావడం ఖాయం. కాగా, పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లో ఓడి టోర్ని నుంచి నిష్ర్కమించింది.