చైనా ఓపెన్ లో సైనా శుభారంభం | Saina Nehwal Gets Past Sun Yu to Enter China Open Super Series | Sakshi
Sakshi News home page

చైనా ఓపెన్ లో సైనా శుభారంభం

Published Wed, Nov 11 2015 2:10 PM | Last Updated on Sun, Sep 3 2017 12:22 PM

చైనా ఓపెన్ లో సైనా శుభారంభం

చైనా ఓపెన్ లో సైనా శుభారంభం

ఫుజౌ (చైనా): చైనా ఓపెన్ ప్రీమియర్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. మహిళ సింగిల్స్ విభాగంలో మొదటి రౌండ్ లో విజయం సాధించి రెండో రౌండ్ లో అడుగుపెట్టింది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన తొలి రౌండ్ లో చైనా యువతార, ప్రపంచ 11వ ర్యాంకర్ సున్ యును వరుస సెట్లలో ఓడించింది. 22-20, 21-18తో విజయం సాధించింది. 49 నిమిషాల్లోనే మ్యాచ్ ముగియడం విశేషం.

పురుషుల సింగిల్స్ లో భారత షట్లర్ అజయ్ జయరామ్ తొలి రౌండ్ లోనే ఓడిపోయాడు. చైనా టాప్ సీడ్ ప్లేయర్ చెన్ లాంగ్ చేతిలో 12-21, 11-21 తేడాతో పరాజయం పాలయ్యాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement