ఫైనల్స్కు దూసుకెళ్లిన సైనా నెహ్వాల్ | Saina Nehwal storms into Australian Open Super Series final | Sakshi
Sakshi News home page

ఫైనల్స్కు దూసుకెళ్లిన సైనా నెహ్వాల్

Published Sat, Jun 11 2016 12:53 PM | Last Updated on Mon, Sep 4 2017 2:15 AM

Saina Nehwal storms into Australian Open Super Series final

సిడ్నీ: ఆస్ట్రేలియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్ సైనా నెహ్వాల్ ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్లో ఆమె నాలుగో సీడ్ యిహాన్ వాంగ్ (చైనా)ను ఓడించింది.  సిడ్నీలో జరిగిన ఈ మ్యాచ్లో సైనా 21-8, 21-12తో విజయం సాధించింది. ఈ పోరును సైనా కేవలం 31 నిమిషాల్లో ముగించింది.  ఆదివారం జరిగే ఫైనల్స్లో ఆమె చైనా షట్లర్ సన్ యూతో తలపడనుంది. ఇక పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్ నిరాశపరిచాడు. హాన్స్ క్రిస్టియన్ విటింగస్ (డెన్మార్క్) చేతిలో  20-22, 13-21 తేడాతో ఓడిపోయాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement