
న్యూఢిల్లీ: ఓర్లీన్స్ మాస్టర్స్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత ఆటగాడు సమీర్ వర్మ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సమీర్ 17–21, 21–19, 21–15తో లుకాస్ కోర్వీ (ఫ్రాన్స్)పై విజయం సాధించాడు.
పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో కిడాంబి నందగోపాల్–ఆల్విన్ ఫ్రాన్సిస్ (భారత్) ద్వయం 21–19, 14–21, 8–21తో మార్క్ లామ్స్‌ఫస్–మార్విన్ సీడెల్ (జర్మనీ) జోడీ చేతిలో ఓడిపోయింది.