న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో సిడ్నీ నగరం మార్టిన్ ప్లేస్లోని కేఫ్ లో ఆగంతకులు 7 మందిని బందీలుగా నిర్బంధించిన నేపథ్యంలో భారత క్రికెట్ జట్టుకు మరింత భద్రతను పెంచారు. భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా భారత్, ఆసీస్ల మధ్య రెండో టెస్టు యధాతథంగా జరుగుతుందని క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఈ నెల 17 నుంచి బ్రిస్బేన్లో ఈ మ్యాచ్ జరగనుంది.
సిడ్నీ ఘటన నేపథ్యంలో అక్కడి భారత కాన్సులేట్ ను మూసివేశారు. కా న్సులేట్ సిబ్బందిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఆగంతకుల చెరలో గుంటూరు జిల్లాకు చెందిన టెకీ అంకిరెడ్డి విశ్వకాంత్ కూడా బందీగా ఉన్నారు.
ఆస్ట్రేలియాలో భారత క్రికెటర్లకు భద్రత పెంపు
Published Mon, Dec 15 2014 4:24 PM | Last Updated on Sat, Sep 15 2018 8:44 PM
Advertisement
Advertisement