ఆసీస్‌లో ఆడడం చాలా కష్టం: సచిన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితిపై బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. అక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదని చెప్పాడు. ‘అక్కడి పరిస్థితులు జీవితాన్ని కష్టతరం చేస్తాయి. ఆటగాళ్లు, మీడియా, గ్రౌండ్స్‌మెన్ ఇలా ప్రతి ఒక్కరు ఇందుకు తమ వంతు పాత్రను పోషిస్తారు. అయితే అక్కడ విశేషంగా రాణిస్తే మాత్రం అందరూ లేచి నిలబడి హర్షం వ్యక్తం చేస్తారు. వారిలో ఉన్న సుగుణం ఇది.
ఇక వచ్చే ప్రపంచకప్‌లో బరిలోకి దిగే అవకాశం లేదు కాబట్టి బయటి నుంచి వీక్షిస్తాను. నేను ఆడలేని స్థితిలో ఉన్నప్పుడు కోచింగ్ చేయడానికి ఇష్టపడను. ఈసారి కూడా మనకే ఎక్కువ అవకాశాలున్నాయని నా నమ్మకం. ఈవెంట్‌పై దృష్టి పెట్టి ముందుకెళితే ఫలితాలు అవే వస్తాయి’ అని సచిన్ అన్నాడు. మరోవైపు దేశంలోని ప్రతీ గ్రామానికి విద్యుత్ సౌకర్యం ఉండేలా కృషి చేస్తానని రాజ్యసభ సభ్యుడు కూడా అయిన సచిన్ అన్నాడు. దీనికి అందరి మద్దతు అవసరమని చెప్పాడు.