సెల్ఫీ స్టిక్స్‌పై నిషేధం | Selfie sticks banned by Wimbledon bosses | Sakshi
Sakshi News home page

సెల్ఫీ స్టిక్స్‌పై నిషేధం

Published Sun, May 3 2015 1:59 AM | Last Updated on Sun, Sep 3 2017 1:18 AM

సెల్ఫీ స్టిక్స్‌పై నిషేధం

సెల్ఫీ స్టిక్స్‌పై నిషేధం

లండన్: ఏ క్రీడా ఈవెంట్స్‌లోనైనా ప్రేక్షకుల నుంచి ఆటగాళ్ల వరకు సెల్ఫీలు తీసుకోవడం పరిపాటి. కానీ వింబుల్డన్‌లో ఇలాంటి చేష్టలు ఇక కుదరవు. సెల్ఫీ స్టిక్స్‌ను అనుమతించకూడదని ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ నిర్ణయించుకుంది. మ్యాచ్‌ల సందర్భంగా నిషేధిత వస్తువుల జాబితాలో ఈ సెల్ఫీ స్టిక్స్‌ను కూడా చేర్చారు. కొంచెం ఎత్తు నుంచి సెల్ఫీలను తీసుకునేందుకు మెటల్ రాడ్స్‌తో కూడిన ఈ స్టిక్స్‌కు మొబైల్, కాంపాక్ట్ కెమెరాలను అమర్చుకుంటారు. ఇదంతా ప్రశాంత వాతావరణాన్ని ఇబ్బంది కలిగించేదిగా ఉందని, భద్రతాపరంగా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నిర్వాహకులు చెబుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement