ఆంధ్రతో రంజీ మ్యాచ్
ఇండోర్: ఆంధ్ర జట్టుతో ప్రారంభమైన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో సర్వీసెస్ జట్టు బ్యాటింగ్ తొలిరోజు నత్తనడకన సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సర్వీసెస్ జట్టు శనివారం ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 170 పరుగులే చేసింది. అన్షుల్ గుప్తా (72), శంషేర్ యాదవ్ (60 బ్యాటింగ్) అర్ధసెంచరీలతో రాణించారు. వికాస్ యాదవ్ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
హైదరాబాద్ మ్యాచ్‌కు అడ్డంకి
ఢిల్లీలోని కర్నాలి సింగ్ స్టేడియంలో త్రిపుర, హైదరాబాద్ జట్ల మధ్య శనివారం జరగాల్సిన రంజీ ట్రోఫీ గ్రూప్ ‘సి’ మ్యాచ్‌కు పొగమంచు అడ్డంకిగా మారింది. వెలుతురు లేమి కారణంగా తొలిరోజు ఆటను నిలిపివేశారు.