
సెమీస్‌లో షరపోవా
రష్యా టెన్నిస్ స్టార్ షరపోవా పునరాగమనంలో అద్భుతంగా రాణిస్తోంది. స్టట్‌గార్ట్ ఓపెన్‌లో ఆమె సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో షరపోవా 6–3, 6–4తో అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా)పై విజయం సాధించింది.