Stuttgart Open
-
పోరాడి ఓడిన బోపన్న జోడీ..
స్టుట్గార్ట్ (జర్మనీ): బాస్ ఓపెన్ ఏటీపీ–250 టెన్నిస్ టోర్నీలో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 6–7 (1/7), 6–7 (5/7)తో మూడో సీడ్ హుబెర్ట్ హుర్కాజ్ (పోలాండ్)–మ్యాట్ పావిచ్ (క్రొయేషియా) జంట చేతిలో ఓడిపోయింది. 83 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో బోపన్న జోడీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు ఆరు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసేందుకు పదిసార్లు అవకాశం లభించినా బోపన్న–షపోవలోవ్ ఒక్కసారీ సద్వినియోగం చేసుకోలేకపోయారు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో బోపన్న–షపోవలోవ్ 6–4, 3–6, 11–9తో నెదోవ్‌యెసోవ్ (కజకిస్తాన్)–ఐజామ్ ఉల్ హఖ్ ఖురేషీ (పాకిస్తాన్)లపై విజయం సాధించారు. సెమీస్‌లో ఓడిన బోపన్న జోడీకి 11,480 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 9 లక్షల 43 వేలు)తోపాటు 90 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. చదవండి: Mary Kom: కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగిన భారత దిగ్గజ బాక్సర్ -
సెమీస్‌లో షరపోవా
రష్యా టెన్నిస్ స్టార్ షరపోవా పునరాగమనంలో అద్భుతంగా రాణిస్తోంది. స్టట్గార్ట్ ఓపెన్‌లో ఆమె సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో షరపోవా 6–3, 6–4తో అనెట్ కొంటావీట్ (ఎస్తోనియా)పై విజయం సాధించింది. -
క్వార్టర్స్‌లో షరపోవా
స్టట్గార్ట్: స్టట్గార్ట్ ఓపెన్‌లో షరపోవా మరో విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో ఆమె క్వార్టర్స్‌కు చేరుకుంది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో షరపోవా 7–5, 6–1తో ఎకతెరినా మకరోవా (రష్యా)ను ఓడించింది. మరోవైపు తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ ‘నిర్వాహకులు నాకు ట్రోఫీలు, బంగారు పళ్లాలేమీ ఇవ్వట్లేదు. కేవలం టోర్నీల్లో ఆడేందుకు వైల్డ్‌కార్డ్ ఎంట్రీలే ఇస్తున్నారు. వాటితోనే ట్రోఫీలు గెలిచేందుకు కష్టపడతాను’ అని చెప్పింది. -
రా...రా... షరపోవా!
►నేడే రష్యా టెన్నిస్ స్టార్ పునరాగమనం ►స్టట్గార్ట్ ఓపెన్‌లో వైల్డ్‌కార్డుతో బరిలోకి నిషేధిత జాబితాలోని మెడిసిన్ తీసుకున్నావ్... సస్పెన్షన్ అన్నారు. తీరా అది ముగిసే దశలో వుంటే... అప్పుడే వైల్డ్కార్డా? నాన్సెన్స్ అన్నారు. ఏదేమైనా తనది కాన్ఫిడెన్స్ అంటోంది... షరపోవా వైఫల్యాలు వెంటాడినా... గాయాలు తిరగదోడినా... సవాళ్లతో సహవాసం... ఆటలో పునరాగమనం తనకు కొత్తకాదని... ఇక ఇప్పుడు డోపింగ్ ఉదంతాన్ని మరచి మళ్లీ రాకెట్ పవర్‌తో సత్తా చాటేందుకు ఆమె సిద్ధమైంది. క్రీడావిభాగం : స్టట్గార్ట్ ఓపెన్‌లో మరియా షరపోవా కొత్త ఇన్నింగ్స్ షురూ. వనవాసం వీడినట్లు షరపోవా సస్పెన్షన్ కాలం ముగిసింది. దాంతో ఈ రష్యా రమణి మళ్లీ బరిలోకి దిగుతోంది. 30 ఏళ్ల రష్యా టెన్నిస్ స్టార్ 15 నెలల సస్పెన్షన్ తర్వాత జర్మనీ ఈవెంట్లో రాకెట్ పడుతోంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీతో స్టట్గార్ట్ ఓపెన్ తొలి రౌండ్లో రొబెర్టా విన్సీ (ఇటలీ)తో పోరుకు సిద్ధమైంది. నంబర్‌వన్ సెరెనా గైర్హాజరు అవుతున్న ఈ టోర్నమెంట్లో షరపోవాకు కాలం కలిసొస్తుందో లేదో తేలుతుంది. నిజానికి షరపోవాకు సవాళ్లు కొత్త కాదు! ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత అందలాలేవీ అంత తేలిగ్గా అందలేదు. ఒక్కో విజయం ఒక్కో మెట్టెక్కించింది. ఒక్కో వైఫల్యం ఒక్కో పాఠం నేర్పించింది. 17 ఏళ్లకే వింబుల్డన్ చాంపియన్ (2004)... 18 ఏళ్లకే నంబర్‌వన్ ర్యాంకు (2005)... ఇవన్నీ ఆటతోనే... ఈ క్రమంలోనే అనేక సవాళ్లను అధిగమించింది. టెన్నిస్...ఫ్యాషన్ షరపోవా యూఎస్ ఓపెన్ (2006) గెలిచాక... తర్వాతి మూడేళ్లలోనే ఎక్కడలేని స్టార్డమ్! ఒక్కసారిగా వచ్చిన క్రేజ్! దీన్ని ఫ్యాషన్ ప్రపంచం బాగా క్యాష్ చేసుకుంది. ప్రపంచంలోని పేరున్న బ్రాండ్లు ఆమె తలుపు తట్టాయి. దీంతో ఆట కాస్త అటకెక్కినా... మోడలింగ్ తళుకులు కమ్మేసినా.... మళ్లీ పట్టుదలతో పైకొచ్చింది. రెండేళ్లు తిరిగేసరికి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2008) చేతికందింది. ఇక ‘కెరీర్ స్లామ్’ ఘనత ఒక్కటే మిగిలింది. ఫ్రెంచ్ ఓపెన్ రూపంలో లోటుగా ఉన్న ఈ గ్రాండ్‌స్లామ్ కూడా ఆమె రాకెట్ నుంచి తప్పించుకోలేకపోయింది. ఆలస్యంగానైనా సరే షరపోవా రెండుసార్లు (2012, 2014) రోలాండ్ గారోస్ టైటిళ్లు చేజిక్కించుకుంది. గాయాలు...వైఫల్యాలు కెరీర్ స్లామ్‌కు షరపోవా ఎనిమిదేళ్ల పోరాటం చేసింది. మధ్యలో భుజం గాయం పదేపదే రష్యన్ స్టార్‌ను నీడలా వెంటాడి వేధించింది. తొలిసారిగా 2007లో ఇదే కారణంగా ఆమె ర్యాంక్ దిగజారింది. అయినా అలుపెరగని పోరాటంతో మరుసటి ఏడాదే ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకుంది. తర్వాత 2009లో గాయం మళ్లీ తిరగబెట్టింది. ఈసారి సర్జరీ తప్పలేదు. చాన్నాళ్లు ఆటకు దూరం. తర్వాత వరుస వైఫల్యాలతో 2010 పేలవంగా గడిచింది. ఇక ఈ రష్యా భామ కథ ముగిసిందనే విమర్శలు... ఇవన్నీ భరించింది. రెండేళ్ల తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌తో కెరీర్ స్లామ్‌తో తనలో ‘వాడి’ రాకెట్లో ‘వేడి’ తగ్గలేదని చేతలతో చెప్పింది. అనంతరం 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ సందర్భంగా నిషేధిత ఉత్ప్రేరకాన్ని తీసుకోవడంతో మొదట రెండేళ్లు నిషేధం విధించినా... ఆ తర్వాత దానిని 15 నెలలకు కుదించారు. ఇప్పుడూ ఆమె కెరీర్‌కు ముగింపు తప్పదనే ఊహాగానాలు వచ్చినా... ఏడాది తిరిగే సరికి సమరానికి సై అంటూ దూసుకొస్తున్న షరపోవాకు ఆల్ ది బెస్ట్. -
షరపోవా... నీకిది తగునా...
రష్యా స్టార్ పునరాగమనం తీరుపై వొజ్నియాకి అసంతృప్తి కాలిఫోర్నియా: నిషేధం ఎత్తేయగానే ముందుగా రష్యన్ స్టార్ మరియా షరపోవా కిందిస్థాయి టోర్నీలతో పునరాగమనం చేయాలని మాజీ ప్రపంచ నంబర్‌వన్ కరోలిన్ వొజ్నియాకి (డెన్మార్క్) సూచించింది. వచ్చిరాగానే ఓ మేటి డబ్ల్యూటీఏ టోర్నీలో బరిలోకి దిగడం తోటి క్రీడాకారిణిలను అగౌరవపరచడమేనని ఆమె చెప్పింది. నిషేధిత జాబితాలోని మెడిసిన్‌ను వాడటంతో షరపోవాపై 15 నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 26తో ఆమె నిషేధం తొలగిపోనుంది. అయితే అప్పటికే మొదలయ్యే స్టుట్గార్ట్ ఓపెన్‌లో షరపోవా బరిలోకి దిగనుండటంపై వొజ్నియాకి పెదవి విరిచింది. ఆమెతో తనకెలాంటి ఇబ్బందిలేదని అయితే కిందిస్థాయి టోర్నీలో పునరాగమనం చేస్తే బాగుంటుందని చెప్పింది. ‘మానవ మాత్రులందరూ తప్పు చేస్తారు. సరిదిద్దుకునేందుకు మరో అవకాశముంటుంది. ఇందులో నాకే ఇబ్బంది లేదు. కానీ నిషేధం గడువు పూర్తికాని సమయంలోనే మొదలయ్యే ఓ టోర్నీలో ఆడటమనేది సబబుగా లేదు’ అని వొజ్నియాకి తెలిపింది. ‘గాయంతో పునరాగమనం చేయడం వేరు... డోపింగ్ బ్యాన్‌తో పునరాగమనం చేయడం వేరు! ఈ రెండింటిని సమదృష్టితో చూడలేం’ అని వివరించింది.