సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 క్రికెట్ టోర్నమెంట్‌లో డాన్‌బాస్కో హైస్కూల్ జట్టు ఘనవిజయం సాధించింది. విజ్ఞాన్ హైస్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో 306 పరుగుల తేడాతో గెలుపొందిం ది. మొదట బ్యాటింగ్ చేసిన డాన్‌బాస్కో జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోరు చేసింది. షరీఫ్ ఖాన్ (142 బంతుల్లో 206; 26 ఫోర్లు) ద్విశతకంతో విజృంభించాడు. ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టాడు. షరీఫ్‌తో పాటు అబ్దుల్ రెహమాన్ జునైద్ (34) రాణించాడు. అనంతరం 359 పరుగుల భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన విజ్ఞాన్ హైస్కూల్ 19.3 ఓవర్లలో కేవలం 52 పరుగులు మాత్రమే చేసి ఓడిపోరుుంది. అబ్దుల్ రెహమాన్ 9 పరుగులిచ్చి 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఇందులో హ్యాట్రిక్ ఉండటం విశేషం.
ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
బాలాజీ మెమోరియల్ హైస్కూల్: 163 (వినయ్ కుమార్ 60; అన్మోల్ 3/37), గ్లెండాల్ అకాడమీ: 141 (అన్మోల్ 34; కార్తీక్3/34).
సెయింట్ పాల్స్ హైస్కూల్: 94, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్: 95/3 (అర్జున్ 32).
క్రీసెంట్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్: 423/6 (బాలాజీ 48, జీఎస్‌పీ తేజ 123, అభిషేక్ 73), నారాయణ కాన్సెప్ట్ స్కూల్: 56 (శతార్థ్ 4/5).
రమాదేవి స్కూల్: 68 (సారుు శ్రుతీశ్ 5/17), సెయింట్ జోసెఫ్ స్కూల్: 69/3 (సాయి శ్రుతీశ్ 37 నాటౌట్).
గీతాంజలి సీనియర్ స్కూల్: 83 (భువన్ 3/19, వివేక్ 3/18), డీఏవీ పబ్లిక్ స్కూల్: 84/1 (కార్తీక్ 30).
సెయింట్ జోసెఫ్ స్కూల్, మలక్‌పేట్: 31 (యశ్వంత్ రెడ్డి 4/9, వ్యాస్ కుమార్ 3/7), హెచ్‌పీఎస్ రామాంతపూర్: 32.
తక్షశిల పబ్లిక్ స్కూల్: 97 (అమిల్ కులకర్ణి25), శ్రీచైతన్య హైస్కూల్: 98/1 (ఆదిత్య మంగట్ 34 నాటౌట్, అవినాశ్36).
ఆల్‌సెయింట్స్ హైస్కూల్: 302/4 (మొహమ్మద్ ఇబాబుద్దీన్ 101 నాటౌట్, జఫరుల్లా ఖాన్ 39, మొహమ్మద్ జకీర్ 44 నాటౌట్), నాగార్జున హైస్కూల్: 53 (జఫరుల్లా ఖాన్ 6/28).
సుప్రీమ్ హైస్కూల్: 172/9 (తరుణ్ 75; తాత్విక్ 3/29), ఇండస్ యూనివర్సల్ స్కూల్: 172/8 (శ్రీవిజయ్ రెడ్డి 50 నాటౌట్; రాజ్‌వీర్ 36, తాత్విక్ 30).
గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్: 211 (రిత్విక్ 50; దేవాన్‌ష రెడ్డి 3/28), భారతీయ విద్యాభవన్‌స: 215/4 (రిషికేశ్ 109 నాటౌట్, పృథ్వీ రెడ్డి 46).
ప్రిస్టన్ హైస్కూల్: 34 (బషీరుద్దీన్ 3/1, ఫరీస్ షరీఫ్ 3/4), సెయింట్ మార్క్స్ బాయ్స్ టౌన్ హైస్కూల్: 38/2.