UNDER 14 CRICKET
-
30 ఫోర్లు, 38 సిక్సర్లతో 401 పరుగులు చేసిన యంగ్ క్రికెటర్
Tanmay Singh: 13 ఏళ్ల కుర్రాడు తన్మయ్ సింగ్.. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న అండర్-14 క్లబ్ క్రికెట్ టోర్నీలో విశ్వరూపం ప్రదర్శించాడు. ర్యాన్ ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీతో జరిగిన మ్యాచ్‌లో దేవ్‌రాజ్ స్పోర్ట్స్ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన తన్మయ్.. 132 బంతుల్లో 30 ఫోర్లు, 38 సిక్సర్ల సాయంతో క్వాడ్రాపుల్ సెంచరీ (401) సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌తో దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్, టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ, భారత యువ క్రికెటర్లు పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్‌లను గుర్తు చేసిన తన్మయ్.. భవిష్యత్తులో టీమిండియా తరఫున ఆడేందుకు గట్టి పునాది వేసుకున్నాడు. సచిన్ (326), కాంబ్లీ (349) అండర్-14 క్రికెట్ ఆడే సమయంలో శారదాశ్రమ్ విద్యామందిర్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ రికార్డు స్థాయిలో 646 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పగా.. హ్యారీస్ షీల్డ్ టోర్నీలో సర్ఫరాజ్ ఖాన్ (439), పృథ్వీ షా (546) రికార్డు స్థాయి స్కోర్లు నమోదు చేశారు. तुफान धुलाई! १३ वर्षांच्या मुलाने ठोकले ३८ षटकार अन् ३० चौकार, पाडला धावांचा पाऊस#tanmay #Cricket https://t.co/ioiCVINd3X — Lokmat (@lokmat) December 19, 2022 ఈ భారీ ఇన్నింగ్స్‌ల ద్వారానే ఈ నలుగురు ముంబైకర్లు వెలుగులోకి వచ్చి ఆ తర్వాతి టీమిండియాకు ప్రాతినిధ్యం వహించే అవకాశాలను దక్కించుకున్నారు. తన్మయ్ కూడా చిన్న వయసులోనే భారీ ఇన్నింగ్స్ ఆడి సచిన్, కాంబ్లీ, సర్ఫరాజ్ ఖాన్, పృథ్వీ షా తరహాలో టీమిండియాకు ఆడే అవకాశాలను దక్కించుకుంటాడని ఈ ఇన్నింగ్స్ గురించి తెలిసిన అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా, తన్మయ్‌తో పాటు రుద్ర బిదురి (135 నాటౌట్; 5 ఫోర్లు, 15 సిక్సర్లు) సెంచరీతో విరుచుకుపడటంతో వారు ప్రాతినిధ్యం వహించిన దేవ్‌రాజ్ స్పోర్ట్స్ క్లబ్ 656 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఛేదనలో ర్యాన్ అకాడమీ 193 పరుగులకే చాపచుట్టేయడంతో దేవ్‌రాజ్ స్పోర్ట్స్ క్లబ్ 463 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తన్మయ్ సాధించిన 401 పరుగుల్లో 226 పరుగులు సిక్సర్ల రూపంలో, 120 పరుగులు బౌండరీల రూపంలో రావడం విశేషం. తన్మయ్ భారీ ఇన్నింగ్స్‌పై ప్రస్తుతం సోషల్‌మీడియాలో చర్చ నడుస్తోంది. ఈ కుర్రాడు టీమిండియా భవిష్యత్ ఆశాకిరణమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
క్రికెట్లో బాల'వీర'
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఈ బాలవీరకు పట్టుమని పన్నెండేళ్లు ఉంటాయి. ఆరేళ్ల వయసు నుంచే క్రికెట్ ఆడడమంటే అంటే ఆసక్తి. లక్ష్యాన్ని నిర్లక్ష్యం చేయలేదు.. నిరంతర సాధన మరవలేదు. చదువునూ పక్కనపెట్టలేదు. బ్యాట్ పట్టి మైదానంలోకి దిగితే ‘శత’క్కొట్టుడే అతని గురి. జిల్లా, అంతర జిల్లాలు, రాష్ట్ర స్థాయిలోనూ రాణిస్తున్నాడు. జాతీయ జట్టుకు సారథ్యమే తన లక్ష్యమని చెప్తున్నాడు అనంతపురం నగరానికి చెందిన వీరారెడ్డి. అనంతపురం నగరంలోని రామచంద్రనగర్‌కు చెందిన కోగటం విజయభాస్కర్‌రెడ్డి, కోగటం శ్రీదేవి దంపతుల కుమారుడు వీరారెడ్డి. తల్లి అనంతపురం మాజీ కార్పొరేటర్. వీరారెడ్డి ప్రస్తుతం నారాయణ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్నాడు. తన 6 ఏళ్ల వయస్సు నుంచే క్రికెట్ అంటే మక్కువ ఏర్పడింది. కోచ్ చంద్రమోహన్‌రెడ్డి వద్ద మెలకువలు నేర్చుకున్నాడు. జట్టులో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ వీరారెడ్డి ఆటతీరును చూసి అండర్ –12 జిల్లా జట్టుకు సారధ్య బాధ్యతలు అప్పగించారు. తనదైన ఆటతీరుతో జిల్లా జట్టు విజేతగా నిలవడంలో కీలకపాత్ర వహించాడు. 11 ఏళ్లకే అండర్–14 జట్టులో చోటు సంపాదించడమే కాకుండా ఆ జట్టును విజయపథంలో నడిపించాడు. నిరంతర సాధనే బలం ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్లో ప్రత్యేకత చాటుకుంటున్న వీరారెడ్డికి నిరంతర ప్రాక్టీసే బలం. రోజూ ఐదు గంటల పాటు సాధన చేస్తాడు. ఉదయం 6 నుంచి 8 వరకు.. సాయంత్రం 5 నుంచి 8 వరకు ప్రాక్టీస్ చేస్తుంటాడు. అంతర్జాతీయ క్రికెటర్లు ధోని, కోహ్లి, రోహిత్ లాంటి వారి ఆటతీరును చూసి, మెలకువలు పాటిస్తున్నాడు. ‘శత’కమే అతని లక్ష్యం ♦ అండర్–14 విభాగంలో అర్థ సెంచరీని సాధించాడు. ♦ అండర్–12 అంతర్ జిల్లా క్రీడా పోటీల్లో 4 మ్యాచ్‌లు ఆడగా మూడింట్లో నాటౌట్‌గా నిలిచాడు. ♦ గుంటూరులో జరిగిన మ్యాచ్‌లో 89 పరుగులు సాధించి బెస్ట్ బ్యాట్స్‌మెన్‌గా ఎంపికయ్యాడు. ♦ గతేడాది రాష్ట్ర క్యాంపునకు ఎంపికయ్యాడు. ♦ అంతర్ జిల్లా క్రీడా పోటీల్లో రెండు అర్థ సెంచరీలు చేశాడు. ♦ 11 ఏళ్లకే అండర్–14 జట్టులో చోటు సాధించడమే కాకుండా 150 పరుగులు సాధించిన ఘనత దక్కింది. ♦ గత రెండేళ్లలో వివిధ ప్రాంతాల్లో జరిగిన మ్యాచ్‌ల్లో 33 అర్థ సెంచరీలు, 3 సెంచరీలు సాధించాడు. ♦ ఆత్మకూరు జట్టుపై 106 పరుగులతో అజేయంగా నిలిచాడు. సౌత్‌జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. మంగళగిరిలో నిర్వహించే కోచింగ్ క్యాంపునకు ఎంపికయ్యాడు. అన్ని విభాగాల్లోనూ విజయమే వీరారెడ్డి జట్టులో బ్యాటింగ్, బౌలింగ్‌లోనూ తనదైన గుర్తింపు దక్కించుకుంటున్నాడు. అండర్–12 అంతర్ జిల్లా క్రీడా పోటీల్లో 4 మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీశాడు. ఫీల్డింగ్‌లోనూ సత్తాచాటుతున్నాడు. బెస్ట్ ఆల్‌రౌండర్‌గానూ రాణిస్తూ అందరి మన్ననలను అందుకుంటున్నాడు. -
షరీఫ్ డబుల్ సెంచరీ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌సీఏ బ్రదర్ జాన్ ఆఫ్ గాడ్ అండర్-14 క్రికెట్ టోర్నమెంట్లో డాన్‌బాస్కో హైస్కూల్ జట్టు ఘనవిజయం సాధించింది. విజ్ఞాన్ హైస్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో 306 పరుగుల తేడాతో గెలుపొందిం ది. మొదట బ్యాటింగ్ చేసిన డాన్‌బాస్కో జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 358 పరుగుల భారీ స్కోరు చేసింది. షరీఫ్ ఖాన్ (142 బంతుల్లో 206; 26 ఫోర్లు) ద్విశతకంతో విజృంభించాడు. ఫోర్లతో ప్రత్యర్థి బౌలర్ల భరతం పట్టాడు. షరీఫ్‌తో పాటు అబ్దుల్ రెహమాన్ జునైద్ (34) రాణించాడు. అనంతరం 359 పరుగుల భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన విజ్ఞాన్ హైస్కూల్ 19.3 ఓవర్లలో కేవలం 52 పరుగులు మాత్రమే చేసి ఓడిపోరుుంది. అబ్దుల్ రెహమాన్ 9 పరుగులిచ్చి 4 వికెట్లు దక్కించుకున్నాడు. ఇందులో హ్యాట్రిక్ ఉండటం విశేషం. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు బాలాజీ మెమోరియల్ హైస్కూల్: 163 (వినయ్ కుమార్ 60; అన్మోల్ 3/37), గ్లెండాల్ అకాడమీ: 141 (అన్మోల్ 34; కార్తీక్3/34). సెయింట్ పాల్స్ హైస్కూల్: 94, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్: 95/3 (అర్జున్ 32). క్రీసెంట్ మోడల్ ఇంగ్లీష్ స్కూల్: 423/6 (బాలాజీ 48, జీఎస్పీ తేజ 123, అభిషేక్ 73), నారాయణ కాన్సెప్ట్ స్కూల్: 56 (శతార్థ్ 4/5). రమాదేవి స్కూల్: 68 (సారుు శ్రుతీశ్ 5/17), సెయింట్ జోసెఫ్ స్కూల్: 69/3 (సాయి శ్రుతీశ్ 37 నాటౌట్). గీతాంజలి సీనియర్ స్కూల్: 83 (భువన్ 3/19, వివేక్ 3/18), డీఏవీ పబ్లిక్ స్కూల్: 84/1 (కార్తీక్ 30). సెయింట్ జోసెఫ్ స్కూల్, మలక్‌పేట్: 31 (యశ్వంత్ రెడ్డి 4/9, వ్యాస్ కుమార్ 3/7), హెచ్‌పీఎస్ రామాంతపూర్: 32. తక్షశిల పబ్లిక్ స్కూల్: 97 (అమిల్ కులకర్ణి25), శ్రీచైతన్య హైస్కూల్: 98/1 (ఆదిత్య మంగట్ 34 నాటౌట్, అవినాశ్36). ఆల్‌సెయింట్స్ హైస్కూల్: 302/4 (మొహమ్మద్ ఇబాబుద్దీన్ 101 నాటౌట్, జఫరుల్లా ఖాన్ 39, మొహమ్మద్ జకీర్ 44 నాటౌట్), నాగార్జున హైస్కూల్: 53 (జఫరుల్లా ఖాన్ 6/28). సుప్రీమ్ హైస్కూల్: 172/9 (తరుణ్ 75; తాత్విక్ 3/29), ఇండస్ యూనివర్సల్ స్కూల్: 172/8 (శ్రీవిజయ్ రెడ్డి 50 నాటౌట్; రాజ్వీర్ 36, తాత్విక్ 30). గ్లోబల్ ఇండియా ఇంటర్నేషనల్: 211 (రిత్విక్ 50; దేవాన్ష రెడ్డి 3/28), భారతీయ విద్యాభవన్స: 215/4 (రిషికేశ్ 109 నాటౌట్, పృథ్వీ రెడ్డి 46). ప్రిస్టన్ హైస్కూల్: 34 (బషీరుద్దీన్ 3/1, ఫరీస్ షరీఫ్ 3/4), సెయింట్ మార్క్స్ బాయ్స్ టౌన్ హైస్కూల్: 38/2. -
హెచ్‌పీఎస్, శ్రీనిధి జట్ల శుభారంభం
సాక్షి, హైదరాబాద్: వీవీఎస్ కప్ అండర్-14 ఇంటర్‌స్కూల్ క్రికెట్ టోర్నమెంట్లో శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్, హెచ్‌పీఎస్ రామంతపూర్ జట్లు శుభారంభం చేశారుు. శ్రీనిధి ఇంటర్నేషనల్ స్కూల్ మైదానం వేదికగా శుక్రవారం హిల్‌సైడ్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీనిధి జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హిల్‌సైడ్ స్కూల్ 7.3 ఓవర్లలో 30 పరుగులకు ఆలౌటైంది. ప్రత్యర్థి బౌలర్లలో నిమిష్ 3 వికెట్లు దక్కించుకోగా... నితిన్ కేవలం 3 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శ్రీనిధి జట్టు 2.3 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 31పరుగులు చేసి గెలిచింది. 4 వికెట్లతో రాణించిన నితిన్ సారుుకి బెస్ట్ ప్లేయర్ పురస్కారం లభించింది. మెరిడియన్ (మాదాపూర్)స్కూల్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో హెచ్‌పీఎస్ రామంతపూర్ జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచిన మెరిడియన్ జట్టు 10.3 ఓవర్లలో 41 పరుగులకు ఆలౌటైంది. హెచ్‌పీఎస్ బౌలర్ బాలాజీ 4 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి అద్భుతంగా రాణించాడు. అనంతరం హెచ్‌పీఎస్ జట్టు 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 44 పరుగులు చేసి గెలిచింది. ధనుశ్ (19 నాటౌట్), వ్యాస్ (14 నాటౌట్) రాణిం చారు. బౌలింగ్‌లో రాణించిన బాలాజీకి బెస్ట్ ప్లేయర్ అవార్డు దక్కింది. -
క్రికెట్ ఎంపిక పోటీల్లో రాణిస్తున్న చిన్నారులు
శ్రీకాకుళం న్యూకాలనీ : భావి క్రికెటర్లు ప్రతిభ చాటుకుంటున్నారు. మండుటెండలో చెమటోడ్చుతున్నారు. ఎలాగైనా తమ కళలను సాకారం చేసుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్) కళాశాల మైదానంలో జరుగుతున్న జిల్లా అండర్–14 బాలుర క్రికెట్ జట్టు సెలక్షన్ మ్యాచ్‌ల్లో రెండోరోజు శనివారం పలువురు క్రీడాకారులు తలుక్కున మెరిశారు. ఈ మ్యాచ్ గురువారం ప్రారంభం కాగా.. శుక్రవారం ప్రతికూల వాతావరణం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. కొనసాగింపు మ్యాచ్‌ను యథావిధిగా శనివారం నిర్వహించారు. పర్యవేక్షకులు, సెలక్టర్లు రాక.. ఎంపికల మ్యాచ్‌ను స్వయంగా నార్త్‌జోన్ క్రికెట్ కార్యదర్శి జి.వి.సన్యాసిరాజు హాజరై పర్యవేక్షించారు. ఆయనతో పాటు ఏసీఏ అండర్–14 చీఫ్ సెలక్టర్ ఎం.వైకుంఠరావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రాబబుల్స్ జట్టుకు ఎంపికైన మొత్తం 34 మంది క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. ప్రతిభతో రాణించిన క్రీడాకారులకు మాత్రమే తుది జట్టులో చోటు కల్పిస్తామని స్పష్టం చేశారు. క్రికెట్ సంఘ ప్రతినిదులు ఎం.యోగేశ్వరరావు, కోచ్‌లు కె.సుదర్శన్, రాజబాబు, శ్రీనివాస్, వరహాలు పాల్గొన్నారు. సిబ్బంది మల్లిఖార్జున్, క్యురేటర్ శరత్ మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. కాగా ఆదివారం రెండో సెలక్షన్ మ్యాచ్ ప్రారంభం కానుందని నిర్వాహకులు వెల్లడించారు. ఆకట్టుకునే ప్రతిభ.. – బ్యాటింగ్ విభాగంలో వి.గణేష్ 84 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. చూడచక్కటి బౌండ్రీలతో ఆకట్టుకున్నాడు. అలాగే డి.తేజ 44, డేవిడ్‌రాజు 41, పి.శివ 33, ఎం.నాగరాజు 27, ఎం.సాయియశ్వంత్ 26, ఎస్బీఎంవి ప్రసాద్ 25 పరుగులతో రాణించారు. – బౌలింగ్ విభాగంలో ఎం.సుధీర్‌కుమార్ నాలుగు వికెట్లు పడగొట్టగా, డి.కులశేఖర్, కె.గణేష్, ఎం.శ్రీవత్సలు మూడేసి వికెట్లతో విజృంభించారు. ఇక సాయియశ్వంత్, డి.వశిష్ట, సంహిత్యాదవ్, ఢిల్లీరావు, పూర్ణచంద్రలు రెండేసి వికెట్లు సాధించారు. తదుపరి మ్యాచ్‌లో రాణింపు కోసం సాయంత్రం నెట్స్‌లో కఠోర సాధన చేశారు.