
మాంచెస్టర్: ప‍్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా తొలి టీ20 కోసం మాంచెస్టర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా తొలి టీ20 జరిగే మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ స్టేడియంలో కోహ్లీసేన నెట్ ప్రాక్టీస్‌కు సిద్ధమైంది. కాగా, ప్రాక్టీస్‌కు ముందు శిఖర్ ధావన్-హార్దిక్ పాండ్యా కలిసి డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఈ ఇద్దరూ ఎక్కడ ఉంటే అక్కడ సందడే. సహచర ఆటగాళ్లను ఆటపట్టిస్తూ, ఏదో ఒక చిలిపి పని చేస్తూ ఉంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి అద్దం ముందు డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను హార్దిక్ పాండ్యా తన ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. "నేను, జట్టా(శిఖర్ ధావన్‌ను సహచర ఆటగాళ్లు ఇలాగే పిలుస్తారు) డ్యాన్స్ చేస్తూ దొరికిపోయాం. మా ఇద్దరికీ డ్యాన్స్, పాటలు పాడటం అంటే చాలా ఇష్టం" అని పాండ్యా పేర్కొన్నాడు. మంగళవారం ఇంగ్లండ్‌తో టీమిండియా తొలి టీ20 మ్యాచ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment