
ఢిల్లీ:తన 32వ పుట‍్టిన రోజును మంగళవారం (డిసెంబర్5) జరుపుకుంటున్నటీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. శ్రీలంకతో మూడో టెస్టులో భాగంగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో శిఖర్ ధావన్(67;91 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) అర్థ శతకం నమోదు చేశాడు. తన పుట్టినరోజున నాడు సొంత గ్రౌండ్‌లో శిఖర్ హాఫ్ సెంచరీ చేయడం మరో విశేషం.
శిఖర్ ధావన్ నాల్గో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. లంక బౌలర్ సండాకన్ బౌలింగ్‌లో డిక్వెల్లాకు క్యాచ్ ఇచ్చిన గబ్బర్ అవుటయ్యాడు. అంతకముందు చతేశ్వర పుజారా(49) పరుగు దూరంలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. నాల్గో రోజు ఆటలో టీ విరామానికి భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. కోహ్లి(25 బ్యాటింగ్), రోహిత్ శర్మ(28 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment