
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా డాషింగ్ బ్యాట్స్‌మన్ శిఖర్ ధావన్ అభిమానులతో దురుసుగా ప్రవర్తించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. సెల్ఫీ కోసం అభిమానులు ఎగబడిపోగా.. అసహనానికి గురైన ధావన్ వారిని తోసేశాడు.
శ్రీలంకతో మూడో టెస్ట్ కోసం ధావన్ తిరిగి ఎంపికయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి ధావన్ హాజరయ్యాడు. ఆ క్రమంలో ఓ అభిమాని సెల్ఫీ తీసుకునేందుకు యత్నించగా.. అతని ముందున్న వ్యక్తిని శిఖర్ ధావన్ తోసేశాడు. ఈ దృశ్యం మీడియాకు చిక్కింది.
ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితిలోనే అలా చేశాడని పలువురు చెబుతున్నప్పటికీ.. ధావన్ తీరుపై మాత్రం సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ ఉల్లాసంగా కనిపించే ధావన్ ఇలా ఆగ్రహంతో కనిపించటం అభిమానులకు సైతం మింగుడుపడటం లేదు. శనివారం నుంచి మూడో టెస్ట్ ప్రారంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment