క్వార్టర్స్‌లో సిక్కి, సుమీత్ జోడీలు
న్యూఢిల్లీ: కెనడా ఓపెన్ గ్రాండ్‌ప్రి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా... పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాయి. కెనడాలోని కాల్‌గరీ నగరంలో జరుగుతున్న ఈ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్ రెండో రౌండ్‌లో సిక్కి–ప్రణవ్ ద్వయం 21–11, 21–17తో రాబిన్ తబెలింగ్–చెరిల్ సీనెన్ (నెదర్లాండ్స్) జోడీపై గెలిచింది. పురుషుల డబుల్స్ రెండో రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సుమీత్–మనూ అత్రి జంట 21–17, 17–21, 21–13తో సోల్‌గుయ్ చోయ్–జే వాన్ కిమ్ (కొరియా) ద్వయంపై విజయం సాధించింది.
మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. మూడో రౌండ్‌లో రెండో సీడ్ ప్రణయ్ 21–17, 14–21, 13–21తో జియోన్ హైయోక్ జిన్ (కొరియా) చేతిలో... అభిషేక్ 15–21, 23–21, 14–21తో పాబ్లో అబియాన్ (స్పెయిన్) చేతిలో... కరణ్ రాజన్ 18–21, 14–21తో కోకి వతనాబె (జపాన్) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గద్దె రుత్విక శివాని 13–21, 21–17, 19–21తో రెండో సీడ్ అయా ఒహోరి (జపాన్) చేతిలో పోరాడి ఓడిపోయింది.