సిక్కి రెడ్డి జోడికి చుక్కెదురు
సింగపూర్ సిటీ: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారీ ఆశలతో బరిలోకి దిగిన టాప్ షట్లర్ పి.వి.సింధు ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 21-11, 14-21, 14-21తో హి బింగ్జియావో (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది.
55 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ గెలిచిన హైదరాబాదీ ఆ తర్వాత నిరాశపర్చింది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా 15-21, 19-21తో నాలుగోసీడ్ జియు చెన్-మా జిన్ (చైనా) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 12-21, 12-21తో రెండోసీడ్ మహ్మద్ అహ్సాన్-హెండ్ర సెతివాన్ (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నారు.
సింధుకు నిరాశ
Published Fri, Apr 15 2016 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 9:55 PM
Advertisement