sikki Reddy Jodi
-
క్వార్టర్స్‌లో అశ్విని–సిక్కిరెడ్డి జంట
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో తెలుగు అమ్మాయి సిక్కిరెడ్డికి మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. అశ్విని పొన్నప్పతో కలిసి మహిళల డబుల్స్‌లో క్వార్టర్స్‌కు చేరుకున్న సిక్కిరెడ్డి.... మిక్స్డ్ డబుల్స్‌తో ప్రిక్వార్టర్స్‌లో ఓడిపోయింది. గురువారం మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్స్‌లో అశ్విని పొన్నప్ప–సిక్కిరెడ్డి జంట 21–14, 21–17తో నదియా ఫాన్ కాసర్ (స్విట్జర్లాండ్)–ఐరిస్ టబేలింగ్ (నెదర్లాండ్స్) జోడీపై నెగ్గింది. మిక్స్డ్ డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా–సిక్కిరెడ్డి (భారత్) ద్వయం 16–21, 2–16, 15–21తో ఎంఆర్ అర్జున్ –కె. మనీషా (భారత్) జంట చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో శుభాంకర్ డే (భారత్) 12–21, 22–20, 21–17తో ఐదో సీడ్ జొనాథ¯Œ క్రిస్టీ (ఇండోనేసియా)పై సంచలన విజయాన్ని సాధించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టాడు. -
సైనా, కశ్యప్ శుభారంభం
లక్నో: సయ్యద్ మోదీ స్మారక వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రెండో సీడ్ సైనా 21–10, 21–10తో కేట్ ఫూ కునె (మారిషస్)పై గెలిచి ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరింది. తెలుగమ్మాయిలు చుక్కా సాయి ఉత్తేజిత రావు, మామిళ్లపల్లి తనిష్క్ ముందంజ వేయగా... శ్రీకృష్ణప్రియ, గుమ్మడి వృశాలి తొలి రౌండ్లో నిష్క్రమించారు. సాయి ఉత్తేజిత 21–19, 21–19తో సెనియా పొలికర్పోవా (ఇజ్రాయెల్)పై, తనిష్క్ 21–17, 21–16తో రసిక రాజే (భారత్)పై గెలిచారు. వృశాలి 12–21, 9–21తో జాంగ్ యిమాన్ (చైనా) చేతిలో ఓడిపోగా... ప్రాషి జోషితో జరిగిన మ్యాచ్‌లో 6–3తో ఆధిక్యంలో ఉన్న దశలో గాయం కారణంగా శ్రీకృష్ణప్రియ వైదొలిగింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో పారుపల్లి కశ్యప్ 21–14, 21–12తో తనోంగ్సక్ సెన్సోమ్బున్సుక్ (థాయ్‌లాండ్)పై, భమిడిపాటి సాయి ప్రణీత్ 21–12, 21–10తో సెర్గీ సిరాంట్ (రష్యా)పై, గురుసాయిదత్ 21–11, 21–15తో జొనాథన్ పెర్సన్ (జర్మనీ)పై నెగ్గి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. అయితే రెండో సీడ్ హెచ్ఎస్ ప్రణయ్ (భారత్) తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రణయ్ 14–21, 7–21తో చికో వార్దోయో (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. ఇతర తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సిరిల్ వర్మ 12–21, 17–21తో సమీర్ వర్మ (భారత్) చేతిలో, చిట్టబోయిన రాహుల్ యాదవ్ 19–21, 21–8, 18–21తో మిలాన్ లుడిక్ (చెక్ రిపబ్లిక్) చేతిలో ఓడిపోయారు. మిక్స్డ్ డబుల్స్‌లో టాప్ సీడ్ సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) ద్వయం 14–21, 11–21తో రెన్ జియాంగ్జు–చావోమిన్ జౌ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది. -
ఇంకోటి గెలిస్తే చరిత్ర
జకార్తా: ఒలింపిక్స్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్ ఇలా అత్యున్నత వేదికలపై మహిళల సింగిల్స్ విభాగంలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణులు పీవీ సింధు, సైనా నెహ్వాల్ పతకాలు కొల్లగొట్టారు. అయితే ఆసియా క్రీడల్లో మాత్రం సింగిల్స్ విభాగం పతకం ఈ ఇద్దరు స్టార్స్‌కే కాకుండా భారత్‌కూ అందని ద్రాక్షగా ఉంది. కొంతకాలంగా మంచి ఫామ్‌లో ఉన్న ఈ ఇద్దరు ఆ కొరత తీర్చుకునేదిశగా మరో అడుగు ముందుకేశారు. ఆసియా క్రీడల్లో భాగంగా సింధు, సైనా మహిళల సింగిల్స్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో సింధు 21–12, 21–15తో గ్రెగోరియా టున్‌జుంగ్ (ఇండోనేసియా)పై... సైనా 21–6, 21–14తో ఫిత్రియాని (ఇండోనేసియా)పై గెలుపొందారు. నేడు జరిగే క్వార్టర్లో రచనోక్ (థాయ్ లాండ్)తో సైనా; జిందాపోల్ (థాయ్‌లాండ్)తో సింధు ఆడతారు. ఈ మ్యాచ్‌ల్లో గెలిస్తే పతకాలు ఖాయమవుతాయి. పోరాడి ఓడిన సుమీత్ జంట... మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప జంట క్వార్టర్ ఫైనల్లో... పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి; సుమీత్ రెడ్డి–మనూ అత్రి జోడీలు ప్రిక్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించాయి. సిక్కి–అశ్విని ద్వయం 11–21, 22–24తో మూడో సీడ్ చెన్ కింగ్‌చెన్–జియా యిఫాన్ జంట చేతిలో ఓడిపోయింది. సాత్విక్–చిరాగ్ 17–21, 21–19, 17–21తో చోయ్ సొల్గు–మిన్ హుక్ కాంగ్ (కొరియా) చేతిలో... సుమీత్–మనూ అత్రి 13–21, 21–17, 23–25తో రెండో సీడ్ లి జున్హుయ్–లియు యుచెన్ (చైనా) చేతిలో పోరాడి ఓడిపోయారు. సుమీత్ జంట నిర్ణాయక మూడో గేమ్‌లో ఏకంగా మూడు మ్యాచ్ పాయింట్లను వదులుకోవడం గమనార్హం. -
పోరాడి ఓడిన సిక్కి–ప్రణవ్ జంట
టోక్యో: కెరీర్లో తొలిసారి ఓ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరాలని ఆశించిన సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా (భారత్) జంటకు నిరాశ ఎదురైంది. జపాన్ ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో ఈ భారత జోడీ పోరాటం సెమీఫైనల్లో ముగిసింది. శనివారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ సెమీఫైనల్లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా ద్వయం 21–14, 15–21, 19–21తో టకురో హోకి–సయాకా హిరోటా (జపాన్) జంట చేతిలో ఓడిపోయింది. గంటపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్‌లో గెలిచిన భారత జోడీ ఆ తర్వాత అదే జోరును కనబర్చలేకపోయింది. నిర్ణాయక మూడో గేమ్‌లో మాత్రం రెండు జోడీలు ఆరంభం నుంచి ప్రతీ పాయింట్ కోసం నువ్వా నేనా అన్నట్లు పోరాడాయి. 7–8తో ఒక పాయింట్‌తో వెనుకబడిన దశలో జపాన్ జోడీ వరుసగా మూడు పాయింట్లు గెలచి 10–8తో ఆధిక్యంలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ ఆధిక్యం 13–9గా మారింది. నాలుగు పాయింట్లతో వెనుకబడిన దశ నుంచి భారత జంట కోలుకోలేకపోయింది. స్కోరును సమం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఒకట్రెండు పాయింట్ల ఆధిక్యాన్ని జపాన్ ద్వయం చివరిదాకా నిలబెట్టుకొని విజయాన్ని దక్కించుకుంది. సెమీస్‌లో ఓడిన సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా జంటకు 4,550 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 2 లక్షల 94 వేలు)తోపాటు 6,420 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సింగిల్స్ ఫైనలో లీ చోంగ్ వీ, అక్సెల్సన్ మరోవైపు ఇదే టోర్నీలో పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రపంచ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్), మాజీ నంబర్‌వన్ లీ చోంగ్ వీ (మలేసియా) ఫైనల్లోకి అడుగు పెట్టారు. సెమీస్‌లో అక్సెల్సన్ 21–16, 21–16తో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ సన్ వాన్ హో (కొరియా)పై, లీ చోంగ్ వీ 21–19, 21–8తో షి యుకి (చైనా)పై గెలుపొందారు. మహిళల సింగిల్స్ విభాగంలో రియో ఒలింపిక్స్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్), హి బింగ్జియావో (చైనా) టైటిల్ పోరుకు అర్హత సాధించారు. మారిన్‌తో జరగాల్సిన తొలి సెమీఫైనల్లో గాయం కారణంగా ప్రపంచ చాంపియన్ నొజోమి ఒకుహారా (జపాన్) ‘వాకోవర్’ ఇవ్వగా... రెండో సెమీఫైనల్లో హి బింగ్జియావో 21–14, 25–23తో చెన్ యుఫె (చైనా)పై గెలిచింది. -
సింధుకు నిరాశ
సిక్కి రెడ్డి జోడికి చుక్కెదురు సింగపూర్ సిటీ: సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. భారీ ఆశలతో బరిలోకి దిగిన టాప్ షట్లర్ పి.వి.సింధు ప్రిక్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌లో సింధు 21-11, 14-21, 14-21తో హి బింగ్జియావో (చైనా) చేతిలో పరాజయం చవిచూసింది. 55 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ గెలిచిన హైదరాబాదీ ఆ తర్వాత నిరాశపర్చింది. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి-ప్రణవ్ చోప్రా 15-21, 19-21తో నాలుగోసీడ్ జియు చెన్-మా జిన్ (చైనా) చేతిలో ఓడారు. పురుషుల డబుల్స్‌లో ప్రణవ్ చోప్రా-అక్షయ్ దివాల్కర్ 12-21, 12-21తో రెండోసీడ్ మహ్మద్ అహ్సాన్-హెండ్ర సెతివాన్ (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నారు.