![Singles Chans Pranav, Desirable - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/7/Untitled-10.jpg.webp?itok=HZzy5edd)
సాక్షి, తెనాలి: జాతీయ సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు అండర్–15 విభాగంలో మూడు టైటిల్స్‌ను కైవసం చేసుకున్నారు. బాలుర సింగిల్స్‌లో గంధం ప్రణవ్ రావు, బాలికల సింగిల్స్‌లో అభిలాష విజేతలుగా నిలిచారు. బాలుర డబుల్స్ విభాగంలో పుల్లెల సాయివిష్ణు–ప్రణవ్ రావు జంట చాంపియన్‌గా అవతరించింది.
అండర్–15 బాలుర ఫైనల్లో ప్రణవ్ రావు (తెలంగాణ) 15–21, 23–21, 21–4తో జయంత్ రాణా (హరియాణా)పై గెలుపొందాడు. బాలికల ఫైనల్లో అభిలాష (తెలంగాణ) 21–6, 21–12తో తస్నీమ్ (గుజరాత్)ను ఓడించింది. బాలుర డబుల్స్ టైటిల్ పోరులో ప్రణవ్ రావు–సాయివిష్ణు ద్వయం 21–14, 21–23, 21–12తో జయంత్ రాణా (హరియాణా)–షేక్ అర్షద్ (ఆంధ్రప్రదేశ్) జంటపై విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment