స్నేహిత్‌కు రజతం | snehit gets silver medal in table tennis tourny | Sakshi
Sakshi News home page

స్నేహిత్‌కు రజతం

Oct 17 2016 10:37 AM | Updated on Sep 4 2017 5:30 PM

జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్ అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.

సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలంగాణ కుర్రాడు స్నేహిత్ అద్వితీయ ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. గుజరాత్‌తోని వీర్ సావర్కర్ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో స్నేహిత్ 1-4 (6-11, 11-8, 9-11, 9-11, 8-11) తో భారత నెం.1 ఆటగాడు మానవ్ టక్కర్ (పీఎస్‌పీబీ) చేతిలో పరాజయం చవిచూశాడు. దాదాపు దశాబ్దం తర్వాత జూనియర్ లెవల్ జాతీయ స్థారుు టీటీ టోర్నీలో తెలుగు కుర్రాడు ఫైనల్‌కు చేరడం విశేషం.

 

గ్లోబల్ టేబుల్ టెన్నిస్ అకాడమీ (జీటీటీఏ)కి చెందిన స్నేహిత్ ఫైనల్‌కు చేరే క్రమంలో రెండో రౌండ్‌లో భారత్ నెం.2 ఆటగాడు జీత్‌చంద్ర (పశ్చిమ బెంగాల్)పై 3-1 (8-11, 11-7, 12-10, 11-6)తేడాతో; సెమీస్‌లో భారత నెం.3 ఆటగాడు మనుష్ షా (గుజరాత్)  4-1 (11-3, 11-7, 10-12, 11-9, 11-2) తేడాతో సంచలన విజయాలు నమోదు చేశాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement