
రన్నరప్ సౌరభ్ వర్మ
జొహర్ బారు: కెరీర్‌లో తొలి గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీ టైటిల్ సాధించే అవకాశాన్ని భారత బ్యాడ్మింటన్ యువతార సౌరభ్ వర్మ చేజార్చుకున్నాడు. మలేసియా ఓపెన్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నీలో ఈ మధ్యప్రదేశ్ షట్లర్ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు.
పురుషుల సింగిల్స్ ఫైనల్లో సౌరభ్ వర్మ 21-15, 16-21, 19-21తో సిమోన్ సాంతోసో (ఇండోనేసియా) చేతిలో ఓటమి పాలయ్యాడు. సౌరభ్ కీలకదశలో ఒత్తిడికి లోనై మూల్యం చెల్లించుకున్నాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో 19-18తో ముందంజలో ఉన్న సౌరభ్ ఆ తర్వాత వరుసగా మూడు పాయింట్లు కోల్పోయి ఓటమిని ఖాయం చేసుకున్నాడు.