'ఈడెన్ లో మ్యాచ్ ఖాయం'
సాక్షి, కోల్కతా:నగరంలో గత కొన్ని రోజులుగా వర్షం పడుతున్నా.. ఈడెన్ గార్డెన్ మైదానాన్ని పూర్తిస్థాయిలో సంరక్షిస్తున్నామని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 21వ తేదీన ఇక్కడ ఆస్ట్రేలియాతో జరిగే రెండో వన్డేకు ఎటువంటి ఇబ్బంది ఉండదని ఆయన హామీ ఇచ్చారు.
'వర్షం ఆగింది..మ్యాచ్ కు ఈడెన్ రెడీ అవుతుంది. ఆసీస్ తో మ్యాచ్ నాటికి గ్రౌండ్ ను మంచి షేప్ సిద్ధం చేస్తాం. ఇప్పడంతా బాగుంది. వారం నుంచి వర్షం పడటం ఆగింది. దాంతో పిచ్ ప్రిపరేషన్ కు అన్ని సిద్ధమయ్యాయి. ఆసీస్ తో ఫుల్ స్వింగ్ లో మ్యాచ్ జరుగుతుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా నూతనుత్తేజంతో ఆసీస్ తో పోరుకు సిద్ధమవుతుంది'అని గంగూలీ పేర్కొన్నారు.
ఆసీస్ తన భారత పర్యటనలో ఐదు వన్డేలు, మూడు ట్వంటీ 20లు ఆడనుంది. ఈ నెల 17వ తేదీన ఆస్ట్రేలియా-భారత జట్ల మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగే వన్డే మ్యాచ్ తో సుదీర్ఘ సిరీస్ ఆరంభం కానుంది.