సౌరవ్ గంగూలీ, జహీర్ ఖాన్ (ఫైల్ ఫొటో)
కోల్‌కతా : ఆదివారంతో 40వ ఏట అడుగుపెట్టిన టీమిండియా మాజీ పేసర్ జహీర్ ఖాన్‌కు అటు మాజీ క్రికెటర్లు, ఇటు అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ విషెస్‌ను తెలియజేశారు. అయితే మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చేసిన ట్వీటే ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.
‘హ్యాపీ బర్త్‌డే జహీర్.. నీకు ఈ ఏడాది మంచి జరగాలి. దయచేసి కొంచెం బరువు తగ్గవు.. నీవు భారత బలం’ అని చమత్కరిస్తూ విషెస్ తెలియజేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక జహీర్ గంగూలీ కెప్టెన్సీలోనే ఎక్కువ మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. సౌరవ్ గంగూలీ సారథ్యంలో 36 టెస్టులు, 88 వన్డేలతో మొత్తం 124 మ్యాచ్‌లాడిన జహీర్ 232 వికెట్లు పడగొట్టాడు. లెఫ్టార్మ్ స్వింగ్ బౌలరైన జహీర్.. 2000లో జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టాడు.
Happy birthday @ImZaheer zed K.. have a great year ...please loose some weight...u were India’s strength 🤝
— Sourav Ganguly (@SGanguly99) October 7, 2018
స్వింగ్‌తో తన బౌలింగ్ వైవిధ్యాన్ని చాటుకున్నాడు. ఈ టోర్నీలో ఫైనల్‌కు చేరినప్పటికి న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓటమిపాలైంది. మొత్తం కెరీర్‌లో 200 వన్డేలు, 92 టెస్టులు, 17 టీ20లాడిన జహీర్ వన్డేల్లో 282, టెస్టుల్లో 311, టీ20ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత ఆటగాళ్లలో జహీర్ నాలుగోవాడు. అతని కన్నా ముందు అనిల్ కుంబ్లే, శ్రీనాథ్, అజిత్ అగార్కర్‌లున్నారు. ఇక జహీర్‌కు తన టీమ్‌మెట్స్ సెహ్వాగ్, లక్ష్మణ్, భజ్జీ, ఆర్పీసింగ్, కైఫ్‌లు సైతం విషెస్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment