దక్షిణాఫ్రికా శుభారంభం | South Africa vs West Indies, 2nd ODI, Johannesburg | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికా శుభారంభం

Published Sun, Jan 18 2015 1:38 AM | Last Updated on Thu, Apr 4 2019 5:21 PM

దక్షిణాఫ్రికా శుభారంభం - Sakshi

దక్షిణాఫ్రికా శుభారంభం

వెస్టిండీస్‌తో తొలి వన్డే
డర్బన్: కెప్టెన్ ఏబీ డి విలియర్స్ (94 బంతుల్లో 81; 6 ఫోర్లు) మెరుపులకు తోడు బౌలర్లు కూడా రెచ్చిపోవడంతో  వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. కింగ్స్‌మీడ్ మైదానంలో శుక్రవారం జరిగిన ఈ తొలి వన్డేను డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన 61 పరుగులతో గెలుచుకుంది. టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ ఇన్నింగ్స్‌కు చివర్లో వర్షం అంతరాయం కలిగించడంతో 48.2 ఓవర్లలో 8 వికెట్లకు 279 పరుగులు చేసింది.

డేవిడ్ మిల్లర్ (68 బంతుల్లో 70; 7 ఫోర్లు; 2 సిక్సర్లు), ఓపెనర్ హషీమ్ ఆమ్లా (66 బంతుల్లో 66; 10 ఫోర్లు) వేగంగా ఆడి స్కోరును పెంచారు. అలాగే 101 ఇన్నింగ్స్‌లోనే వన్డేల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఆటగాడిగా ఆమ్లా నిలిచాడు. కోహ్లి, రిచర్డ్స్ (114 ఇన్నింగ్స్) రెండో స్థానంలో ఉన్నారు. టేలర్, రస్సెల్‌లకు రెండేసి వికెట్లు దక్కా యి. ఆ తర్వాత సవరించిన లక్ష్యం ప్రకారం విండీస్ 32 ఓవర్లలో 226 పరుగులు చేయాల్సి ఉండగా సఫారీ పేసర్ల ధాటికి కుప్పకూలింది.

28.2 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌట్ అయ్యింది. క్రిస్ గేల్ (24 బంతుల్లో 41; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) ధాటిగా ఆడడంతో తొలి వికెట్‌కు ఆరు ఓవర్లలోనే 51 పరుగులు జత చేరాయి. అయితే స్టెయిన్ బౌలింగ్‌లో గేల్ అవుట్ కావడంతో విండీస్ ఇన్నింగ్స్ పతనం దిశగా సాగింది. రామ్‌దిన్ (32 బంతుల్లో 31; 2 ఫోర్లు)  ఓ మాదిరిగా ఆడాడు. డేల్ స్టెయిన్, ఫిలాండర్, స్పిన్నర్ తాహిర్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. డివిలియర్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement