భారత్తో రెండు టెస్టుల సిరీస్లో ఘోరంగా ఓడిపోయిన వెస్టిండీస్ ఓ వివాదంలో చిక్కుకుంది. విండీస్ బౌలర్లు శామ్యూల్స్, షిల్లింగ్ఫోర్డ్ బౌలింగ్ శైలిపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ముంబైలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా అంపైర్లు వీరిద్దరిపై ఐసీసీకి ఫిర్యాదు చేశారు.
శామ్యూల్స్, షిల్లింగ్ఫోర్డ్ బౌలింగ్ యాక్షన్పై సందేహం వ్యక్తం చేస్తూ ఫీల్డ్ అంపైర్లు, టీవీ అంపైర్లు ఫిర్యాదు చేసినట్టు ఐసీసీ వెల్లడించింది. ఈ విషయాన్ని విండీస్ టీమ్ మేనేజర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. శామ్యూల్స్, షిల్లింగ్ఫోర్డ్ బౌలింగ్ శైలిని ఐసీసీ నిశితంగా పరిశీలించనుంది. బౌలింగ్ యాక్షన్కు సంబంధించి 21 రోజుల్లోగా వ్యక్తిగత అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ఇద్దరు బౌలర్లకు సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా బౌలింగ్ చేసినట్టు తేలితే వీరిద్దరిపై చర్యలు తీసుకుంటారు.
వెస్టిండీస్ బౌలర్లపై ఐసీసీకి ఫిర్యాదు
Published Sun, Nov 17 2013 9:32 AM | Last Updated on Tue, Nov 6 2018 8:50 PM
Advertisement
Advertisement