వన్డేలలో అగ్రస్థానం మళ్లీ వాళ్లదే | South Arfica retains top rank in one day internationals | Sakshi
Sakshi News home page

వన్డేలలో అగ్రస్థానం మళ్లీ వాళ్లదే

Published Mon, May 1 2017 2:06 PM | Last Updated on Tue, Sep 5 2017 10:08 AM

వన్డేలలో అగ్రస్థానం మళ్లీ వాళ్లదే

వన్డేలలో అగ్రస్థానం మళ్లీ వాళ్లదే

ఐసీసీ వన్డే ర్యాంకులలో తన అగ్రస్థానాన్ని దక్షిణాఫ్రికా మళ్లీ నిలబెట్టుకుంది. ఆస్ట్రేలియా రెండో స్థానంలో నిలవగా భారత్ ఒక స్థానం మెరుగుపరుచుకుని టాప్ 3లో స్థానం సంపాదించింది. న్యూజిలాండ్ మాత్రం ఒక స్థానాన్ని కోల్పోయి నాలుగో ర్యాంకులో నిలిచింది. టీమిండియా 5 పాయింట్లు సంపాదించగా న్యూజిలాండ్ కేవలం రెండు పాయింట్లే సంపాదించింది. భారత్ 117 రేటింగ్ పాయింట్లు, కివీస్ 115 రేటింగ్ పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

అయితే, 2019 ప్రపంచకప్‌లోకి నేరుగా ఎంట్రీ కావాలంటే ఉండాల్సిన ఎనిమిదో స్థానాన్ని మాత్రం వెస్టిండీస్‌ను తలదన్ని పాకిస్తాన్ కైవసం చేసుకుంది. 2017 సెప్టెంబర్ 30 నాటికి ఇంగ్లండ్‌తో పాటు టాప్ 7 ర్యాంకుల్లో ఉన్న జట్లు ఆటోమేటిగ్గా 2019 ప్రపంచకప్‌ పోటీలకు అర్హత సాధిస్తాయి. ఈసారి ప్రపంచకప్ ఇంగ్లండ్‌లో జరుగుతుండటంతో ఆ జట్టుకు అర్హత దానంతట అదే వస్తుంది. 2016 మే 1వ తేదీ తర్వాత ఆడిన మ్యాచ్‌లను పరిగణనలోకి తీసుకుని తాజా ర్యాంకులను నిర్ణయించారు. పాకిస్తాన్ 90 నుంచి 88 పాయింట్లకు పడిపోగా వెస్టిండీస్ 83 నుంచి 79 పాయింట్లకు పడిపోయింది. దాంతో వెస్టిండీస్ కంటే తొమ్మిది పాయింట్ల ఆధిక్యంలో ఉన్న పాక్.. ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

వన్డే ర్యాంకులు ఇలా...
దక్షిణాఫ్రికా - 123 పాయింట్లు (+4)
ఆస్ట్రేలియా - 118 పాయింట్లు
భారత్ - 117 పాయింట్లు (+5)
న్యూజిలాండ్ - 115 పాయింట్లు (+2)
ఇంగ్లండ్ - 109 పాయింట్లు (+1)
శ్రీలంక - 93 పాయింట్లు (-5)
బంగ్లాదేశ్ - 91 పాయింట్లు (-1)
పాకిస్తాన్ - 88 పాయింట్లు (-2)
వెస్టిండీస్ - 79 పాయింట్లు (-4)
అఫ్ఘానిస్థాన్ - 52 పాయింట్లు
జింబాబ్వే - 46 పాయింట్లు
ఐర్లండ్ - 43 పాయింట్లు (+1)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement