సెమీస్‌లో సౌజన్య జోడి | sowjanya Jodi integrity semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో సౌజన్య జోడి

Published Thu, Aug 8 2013 12:36 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

సెమీస్‌లో సౌజన్య జోడి

సెమీస్‌లో సౌజన్య జోడి

 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సౌజన్య భవిశెట్టి-రిషిక సుంకర జోడి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.
 
  ఈజిప్టులో జరుగుతున్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సౌజన్య-రిషిక ద్వయం 6-1, 7-6 (7/4)తో మహిత రెడ్డి (భారత్)-ఎల్కీ లెమెన్స్ (బెల్జియం) జోడిపై గెలిచింది. సింగిల్స్ తొలి రౌండ్‌లో సౌజన్య 6-4, 1-6, 6-1తో నాలుగో సీడ్ సుసాన్ సెలిక్ (స్వీడన్)ను బోల్తా కొట్టించగా... రిషిక 6-1, 7-5తో రోనా బెరిషా (బ్రిటన్)పై నెగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement