టాప్-20లోకి కశ్యప్
న్యూఢిల్లీ: భారత యువ షట్లర్, తెలుగుతేజం కిడాంబి శ్రీకాంత్ 23వ ర్యాంకుకు పడిపోయాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) తాజాగా విడుదల చేసిన సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో అతను ఏకంగా 10 స్థానాలు కోల్పోయి 23వ ర్యాంకుకు దిగజారాడు. 21 ఏళ్ల ఏపీ కుర్రాడు సరిగ్గా రెండు వారాల క్రితం కెరీర్ బెస్ట్ 13వ ర్యాంకుకు ఎగబాకాడు. అయితే థామస్ కప్‌తో పాటు జపాన్ ఓపెన్‌లోనూ నిరాశపరచడంతో అతని ర్యాంకు పడిపోయింది. మరో ఆటగాడు పారుపల్లి కశ్యప్ మళ్లీ టాప్-20 ర్యాంకుల్లోకి చేరుకున్నాడు.
ఇతనూ జపాన్ ఓపెన్ తొలి రౌండ్‌లోనే కంగుతిన్నప్పటికీ ఒక ర్యాంకు మెరుగుపర్చుకొని 20వ స్థానంలో నిలిచాడు. మహిళల సింగిల్స్ ర్యాంకుల్లో భారత నంబర్‌వన్ సైనా నెహ్వాల్ 8వ ర్యాంకులో, తెలుగమ్మాయి పి.వి.సింధు 10వ ర్యాంకులో కొనసాగుతున్నారు. వీళ్లిద్దరూ జపాన్ ఓపెన్‌లో పాల్గొనడంలేదు. ఉబెర్ కప్‌లో రాణించిన హైదరాబాదీలిద్దరూ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత్ నుంచి ఎవరికి టాప్-25లో చోటు దక్కలేదు.
23వ ర్యాంకుకు పడిపోయిన శ్రీకాంత్
Published Fri, Jun 13 2014 1:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:42 AM
Advertisement