న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టి20ల సిరీస్‌ను శ్రీలంక 1-0తో గెలిచింది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా...
పల్లెకెలె: న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టి20ల సిరీస్‌ను శ్రీలంక 1-0తో గెలిచింది. ఇరు జట్ల మధ్య తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా... గురువారం జరిగిన రెండో టి20లో శ్రీలంక 8 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. తొలుత న్యూజిలాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 142 పరుగులు చేసింది.
లూక్ రాంచీ (34 నాటౌట్), డెవ్రిచ్ (30) ఫర్వాలేదనిపించారు. మలింగ, కులశేఖర, మాథ్యూస్, మెండీస్, పెరిరా తలా ఓ వికెట్ తీశారు. తర్వాత 143 పరుగుల లక్ష్యాన్ని లంక 17.5 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ దిల్షాన్ (59 నాటౌట్), కుశాల్ పెరిరా (57) అర్ధసెంచరీలు సాధించారు. మెక్లింగన్, నికోల్ చెరో వికెట్ పడగొట్టారు.