మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కొలొంబో వేదికగా శ్రీలంకతో ఇవాళ (జులై 10) జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. జులై 8న జరిగిన తొలి టీ20లోనూ గెలుపొందిన కివీస్ (5 వికెట్ల తేడాతో విజయం).. తాజాగా విజయంతో 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. బౌలింగ్‌లో లీ తహుహు (4/21), బ్యాటింగ్‌లో సుజీ బేట్స్ (52), మెలీ కెర్ర్ (33 నాటౌట్) రాణించి కివీస్‌ను గెలిపించారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తహుహుతో పాటు ఎడెన్ కార్సన్ (4-0-15-1), ఫ్రాన్ జోనాస్ (4-0-19-0) పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లలో శ్రీలంక 6 వికెట్ల నష్టానికి 118 పరుగులు మాత్రమే చేయగలిగింది. లంక ఇన్నింగ్స్‌లో హసిని పెరీరా (33), హర్షిత మాధవి (23), నీలాక్షి డిసిల్వ (22) ఓ మోస్తరు పరుగులు చేయగా.. వరుస సెంచరీలు సాధించి భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ అటపట్టు (2) నిరాశపర్చింది.
అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్.. సుజీ బేట్స్, మెలీ కెర్ర్‌లతో పాటు బెర్నడైన్ (24) రాణించడంతో 18.4 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. లంక బౌలర్లలో కవిశ దిల్హరి, ఇనోకా రణవీర తలో వికెట్ పడగొట్టారు. ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో టీ20 జులై 12న ఇదే వేదికగా జరుగనుంది. కాగా, ఈ సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను శ్రీలంక 2-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment