
స్టీవ్ స్మిత్ (పాత ఫొటో)
సాక్షి, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ త్వరలోనే మైదానంలోకి పునరాగమనం చేయనున్నారు. వచ్చే నెలలో కెనడాలో జరిగే గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో ఆయన పాల్గొననున్నారు. బాల్ ట్యాంపరింగ్ ఉదంతంలో చిక్కుకున్న స్మిత్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) 12 నెలల పాటు నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీంతో బీసీసీఐ కూడా ఐపీఎల్‌లో ఆడేందుకు స్మిత్‌ను అనుమతించలేదు.
నిషేధం ప్రకారం స్మిత్ జాతీయ, అంతర్జాతీయ క్రికెట్‌కు 12 నెలలపాటు దూరంగా ఉండాలి. అయితే, ఇతర దేశాల్లో జరిగే టోర్నమెంట్లలో ఆయా బోర్డుల అనుమతితో పాల్గొనవచ్చు. గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో పాల్గొనడానికి స్మిత్‌కు పిలుపు వచ్చింది. ఇదే లీగ్‌లో క్రిస్ లిన్, క్రిస్ గేల్, షాహిద్ అఫ్రిది తదితర క్రీడాకారులు సైతం పాల్గొననున్నారు.
గ్లోబల్ టీ20 కెనడా లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటున్నాయి. మ్యాచ్‌లు అన్ని టోరంటోలోని మాపిల్ లీఫ్ క్రికెట్ క్లబ్ వేదికగా జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment