సుబ్రతారాయ్ దేశభక్తుడు: కపిల్ దేవ్
సహారా ఇండియా అధినేత సుబ్రతా రాయ్ అరెస్ట్ పై భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించారు. సుబ్రతా దేశభక్తుడు అని కపిల్ వ్యాఖ్యానించారు. త్వరలోనే ఈ కేసు నుంచి బయటపడుతారని కపిల్ ఆశాభావం వ్యక్తం చేశారు. సుబ్రతాను పోలీస్ కస్టడీకి తరలించారనే వార్తలను టెలివిజన్ చూశానని ఆయన అన్నారు. దేశభక్తి మెండుగా ఉన్న వ్యక్తుల్లో సుబ్రతా ఒకరని కపిల్ తెలిపారు.
ఇన్వెస్టర్లకు 20 వేల కోట్ల రూపాయలను తిరిగి చెల్లించలేదనే ఆరోపణలపై నమోదైన కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో సుబ్రతాపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్రతాను ఉత్త్రరప్రదేశ్ పోలీసులు లక్నో న్యాయస్థానంలో హాజరుపరుచగా, ఆయనను మార్చి 4 తేది వరకు పోలీస్ కస్టడి విధించారు.