యువరాజ్కు తగ్గిన డిమాండ్
ఐపీఎల్-9 సీజన్ వేలంలో భారత ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్కు డిమాండ్ తగ్గగా, ఊహించని విధంగా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సన్కు కాసుల పంట పండింది. శనివారం జరుగుతున్న వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్.. యువీని 7 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. గతేడాది వేలంలో రూ. 16 కోట్ల ధర పలికిన యువీ.. ఈసారి దాదాపు సగానికి సగం తక్కువ ధర పలికాడు. కాగా వాట్సన్ భారీ ధరకు అమ్ముడుపోయాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 9.5 కోట్ల రూపాయలకు వాట్సన్ను దక్కించుకుంది. వేలంలో ఆటగాళ్ల ధరలు.. కొనుకొన్న ఫ్రాంచైజీల వివరాలు..
షేన్ వాట్సన్ (రూ. 9.5 కోట్లు): రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
యువరాజ్ సింగ్ (రూ. 7 కోట్లు):సన్ రైజర్స్ హైదరాబాద్
దినేశ్ కార్తీక్ (రూ. 2.3 కోట్లు): గుజరాత్ లయన్స్
కెవిన్ పీటర్సన్ (రూ. 3.5 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్
ఇషాంత్ శర్మ (రూ. 3.8 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్
ఆశీష్ నెహ్రా (రూ. 5.5 కోట్లు): సన్ రైజర్స్ హైదరాబాద్
డేల్ స్టెయిన్ (రూ. 2.3 కోట్లు): గుజరాత్ లయన్స్
జోస్ బట్లర్ (రూ. 3.8 కోట్లు): ముంబై ఇండియన్స్
సంజూ శామ్సన్ (రూ. 4.2 కోట్లు): ఢిల్లీ డేర్ డెవిల్స్
ఇర్ఫాన్ పఠాన్(కోటి): పుణె సూపర్ జెయింట్స్
క్రిస్ మోరిస్ (రూ. 7 కోట్లు): ఢిల్లీ డేర్ డెవిల్స్
స్టువర్ట్ బిన్నీ (రూ.2 కోట్లు): రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
మిచెల్ మార్ష్ (రూ. 4.8 కోట్లు): పుణె సూపర్ జెయింట్స్
ధవళ్ కులకర్ణి (రూ. 2 కోట్లు): గుజరాత్ లయన్స్
ప్రవీణ్ కుమార్ (రూ.3.8 కోట్లు): గుజరాత్ లయన్స్
మోహిత్ శర్మ (రూ. 6.5 కోట్లు): కింగ్స్ లెవెన్ పంజాబ్
టిమ్ సౌథీ (రూ.2.5 కోట్లు): ముంబై ఇండియన్స్