ఆ ఇద్దరి రాకతో మరింత సంతోషం:పాంటింగ్ | Mumbai Indians coach Ponting happy to have Buttler, Southee | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి రాకతో మరింత సంతోషం:పాంటింగ్

Published Sat, Feb 6 2016 6:11 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 PM

ఆ ఇద్దరి రాకతో మరింత సంతోషం:పాంటింగ్

ఆ ఇద్దరి రాకతో మరింత సంతోషం:పాంటింగ్

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్ లో భాగంగా శనివారం జరిగిన వేలంలో ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు బట్లర్, న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీలను ముంబై ఇండియన్స్ దక్కించుకోవడం పట్ల ఆ జట్టు చీఫ్ కోచ్ రికీ పాంటింగ్ ఆనందం వ్యక్తం చేశాడు. ఆ ఇద్దరి రాకతో మరింత సంతోషంగా ఉందంటూ ట్విట్టర్ లో ఓ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు.

 

ఆ స్టార్ ఆటగాళ్ల రాకతో తమ జట్టు మరింత బలపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అటు వికెట్ కీపింగ్ తో పాటు బ్యాటింగ్ లో విశేషంగా రాణించే బట్లర్ సేవలు క్లిష్ట సమయాల్లో జట్టుకు ఉపయోగపడతాయనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు. మరోవైపు సౌథీ తమతో కలవడంతో లసిత్ మలింగా స్థానం భర్తీ అయినట్లేనని తెలిపాడు. ఐపీఎల్ తాజా వేలంలో కోటి యాభై లక్షల కనీస ధర ఉన్న బట్లర్ ను డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్ రూ.3.8 కోట్లకు దక్కించుకోగా, ఒక కోటి కనీస ధర ఉన్న టిమ్ సౌథీని కూడా రూ.2.5 కోట్లకు కొనుగోలు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement