సన్ రైజర్స్ 'చెత్త' రికార్డు'! | Sunrisers' score at five down for 32 runs, the lowest by any team this season | Sakshi
Sakshi News home page

సన్ రైజర్స్ 'చెత్త' రికార్డు'!

Published Tue, Apr 26 2016 9:59 PM | Last Updated on Sun, Sep 3 2017 10:49 PM

సన్ రైజర్స్ 'చెత్త' రికార్డు'!

సన్ రైజర్స్ 'చెత్త' రికార్డు'!

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9 సీజన్లో వరుస మూడు విజయాలతో ఊపు మీద కనిపించిన సన్ రైజర్స్ హైదరాబాద్ చెత్త రికార్డును మూటగట్టుకుంది. సొంతగడ్డపై మంగళవారం పుణె సూపర్ జెయింట్స్ తో మ్యాచ్లో సన్ రైజర్స్ 32 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి చెత్త రికార్డును నమోదు చేసింది. ఈ సీజన్ లో  ఒక జట్టు ఇలా 32 పరుగులకే ఐదు వికెట్లను నష్టపోవడం ఇదే ప్రథమం. ఐపీఎల్లో ఓవరాల్ గా ఐదు వికెట్లను నష్టపోయే క్రమంలో ఇది ఆరో అత్యల్పం కావడం గమనార్హం.

టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన సన్ రైజర్స్ పరుగుల ఖాతా తెరవకుండానే కెప్టెన్ డేవిడ్ వార్నర్ వికెట్ ను కోల్పోయింది. అనంతరం ఆదిత్య తారే(8), ఇయాన్ మోర్గాన్(0), హూడా(1), హెన్రీక్యూస్(1)లను నష్టపోయి కష్టాల్లో పడింది. ఈ ఐదు వికెట్లలో అశోక్ దిండా, మిచెల్ మార్ష్ లు తలో రెండు వికెట్లు సాధించగా,రవి చంద్రన్ అశ్విన్ కు ఒక వికెట్ దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement